iDreamPost

హైదరాబాద్ రోడ్లపై కొత్త బస్సులు.. ఆ ఉద్యోగులకు ఫ్రీ జర్నీ!

Free Buses For Employees?: హైదరాబాద్ రోడ్లపై కొత్త బస్సులు సందడి చేయనున్నాయి. ఉద్యోగుల కోసం, పెరిగిపోతున్న ట్రాఫిక్ ని నియంత్రించడం కోసం దిగ్గజ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ బస్సులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Free Buses For Employees?: హైదరాబాద్ రోడ్లపై కొత్త బస్సులు సందడి చేయనున్నాయి. ఉద్యోగుల కోసం, పెరిగిపోతున్న ట్రాఫిక్ ని నియంత్రించడం కోసం దిగ్గజ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ బస్సులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హైదరాబాద్ రోడ్లపై కొత్త బస్సులు.. ఆ ఉద్యోగులకు ఫ్రీ జర్నీ!

హైదరాబాద్ లో ఆఫీసులకు వెళ్లాలంటే ట్రాఫిక్ లో చుక్కలు చూడాల్సిన పరిస్థితి. రెండు, మూడు గంటలు ట్రాఫిక్ లో బిక్కుబిక్కుమంటూ గడిపితేనే గానీ ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి. చాలా మంది ఉద్యోగులకు సొంతంగా కార్లు ఉండడంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. భారీ ట్రాఫిక్ కారణంగా ఆఫీసులకు ఆలస్యం అవ్వడం.. దీని వల్ల జీతంలో కటింగులు పెరగడం వంటివి ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగేందుకు కారణమవుతున్నాయి. అది సంస్థ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగులు టెన్షన్ లేకుండా ఆఫీసుకి వస్తేనే వాళ్ళు మరింత మెరుగ్గా, హ్యాపీగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేయగలుగుతారు. ట్రాఫిక్ లో బైక్ లేదా కార్లు నడుపుకుంటూ వచ్చే వారికి కనిపించే చుక్కలు అన్నీ ఇన్నీ కాదు.

ఈ సమస్యలని దృష్టిలో పెట్టుకునే మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా పేరొందింది. ఈ సంస్థ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కోసం కనెక్టర్ బస్సులను తీసుకురానుంది. హైదరాబాద్ బిజీ రోడ్ల మీద వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు ఈ బస్సులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా’ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ లో తీసిన మైక్రోసాఫ్ట్ కనెక్టర్ బస్సు ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. జూన్ 14న ఈ ఫోటోలు తీయగా అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ పోస్ట్ కి ఓన్లీ – ఆప్షన్ ట్రేడర్ అనే యూజర్ స్పందిస్తూ.. ఇప్పటికే బెంగళూరులో పలు కంపెనీలు తమ ఉద్యోగుల కోసం కనెక్టర్ బస్సు సేవలను అందిస్తున్నాయని అన్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులకే కాకుండా మిగతా పబ్లిక్ కి కూడా ఈ కనెక్టర్ బస్సుల్లో ఎక్కేందుకు అనుమతి ఇవ్వడం మంచి చొరవ అని అన్నారు. కానీ క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళకి ఇది తీరని దెబ్బ అంటూ సదరు వ్యక్తి ట్వీట్ చేశారు.

మైక్రోసాఫ్ట్ కనెక్టర్ బస్సు సేవలు 2007లోనే అమెరికాలో ప్రారంభమయ్యాయి. అక్కడ ఈ కనెక్టర్ బస్సులు తమ సంస్థ ఉద్యోగులను ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాయి. వాహనాల వినియోగం తగ్గించడంతో పాటు పర్యావరణానికి హాని తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ విధంగా కనెక్టర్ బస్సు సర్వీసుని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ ఈ మైక్రోసాఫ్ట్ కనెక్టర్ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే ఈ బస్సు సేవలు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పూర్తిగా ఉచితం అని తెలుస్తోంది. ఇతర కంపెనీలకు చెందిన వారికి సర్వీస్ ఛార్జీలు ఉండబోతున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి