iDreamPost

చిరంజీవితో ఉన్న ఈ కుర్రాడు.. ఇప్పుడు స్టార్ హీరో! బంధువు కూడా!

మెగాస్టార్ చిరంజీవి చేతిలో నుండి బొమ్మను తీసుకుంటున్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా.. ఇప్పుడు అతడో స్టార్ హీరో. అతను చిరంజీవికి బంధువు కూడా. ఇంతకు అతడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి చేతిలో నుండి బొమ్మను తీసుకుంటున్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా.. ఇప్పుడు అతడో స్టార్ హీరో. అతను చిరంజీవికి బంధువు కూడా. ఇంతకు అతడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.

చిరంజీవితో ఉన్న ఈ కుర్రాడు.. ఇప్పుడు స్టార్ హీరో! బంధువు కూడా!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయం కృషితో ఎదిగిన నటుడాయన. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అలాగే మెగా ఇంటి నుండి కూడా వారసులు వచ్చారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, శిరీష్, వరుణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక.. ఇలా అరడజను మంది పరిశ్రమలో వచ్చి సత్తా చాటారు. అయితే ఇందులో చాలా మందిని ఇండస్ట్రీలోకి పరిచయం చేసింది చిరు కావడం విశేషం. అల్లు అర్జున్.. అందరికీ గంగోత్రి నుండే పరిచయం కానీ.. డాడీ సినిమాతో ఇంటడ్రూస్ చేశాడు మెగాస్టార్. అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ యాక్ట్ చేసిన సంగతి విదితమే.

అలాగే మరో హీరోను కూడా తన చిత్రంతోనే పరిచయం చేశారు మెగాస్టార్. ఇదిగో ఈ ఫోటోలో చిరంజీవి పక్కన కనిపించిన ఈ కుర్రాడిని చూశారా..? ఎవరో గుర్తు పట్టండి చూద్దాం. చిరుకు బంధువు కూడా. బొమ్మతో ఆడుకుంటున్న ఆ పిల్లాడు.. ఆజాను భావుడు. హైట్, పర్సనాలిటీలో తండ్రికి తగ్గ తనయుడు కూడా. హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా.. మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇతడు కూడా మెగా వారసుడు కావడం విశేషం.  ఇంతకు అతడు ఎవరంటే.. చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ఈ ఫోటోలో కనిపిస్తోంది వరుణ్ తేజ్. ఈ మూవీ హ్యాండ్సప్. ఇందులో హీరోలుగా బ్రహ్మనందం, నాగబాబు నటించారు.

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమాకు కథ అందించింది ప్రముఖ నటి జయసుధ కావడం విశేషం. ఇందులో చిరంజీవిది గెస్ట్ రోల్. మూవీ చివరిలో కనిపించి.. మన విలన్ సోనూ సూద్‌ను అల్లాడిస్తాడు. ఆ సమయంలోనే బొమ్మ కోసం వస్తాడు వరుణ్ తేజ్. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2000 సంవత్సరంలో విడుదలైంది. తన పేరుతోనే వరుణ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇలా వచ్చి..ఆ బొొమ్మ తీసుకుని వెళ్లిపోతాడు. బహుశా చైల్డ్ ఆర్టిస్టుగా వరుణ్‍కు ఇదే తొలి, చివరి పిక్చర్ కావొచ్చు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ జయసుధ భర్త. నితిన్ కపూర్ వ్యవహరించారు. శశిప్రీతమ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం అప్పట్లో మంచి ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. గత ఏడాదే ఓ ఇంటి వాడయ్యాడు.

హ్యాండ్సప్ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంటరైన వరుణ్.. ఆ తర్వాత ముకుందతో హీరోగా మారాడు. కంచె వంటి డిఫరెంట్ కథను ఎంపిక చేసుకుని రిస్క్ చేసినా.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. లోఫర్, మిస్టర్ డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత వచ్చిన ఫిదా.. మంచి హిట్ అందుకుంది. తొలి ప్రేమ, అంతరిక్షం సినిమాలు కూడా మెప్పించాయి. వెంకీ మామతో కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3 చేయగా.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. గాంధీవధారి అర్జున, గని వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ అనే పిక్చర్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మార్చి 1న విడుదల కాబోతుంది. గత ఏడాది తన ప్రేయసి, నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ప్రస్తుతం అతడు మట్కా అనే సినిమా చేస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి