iDreamPost

TDP నుంచి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి: లక్ష్మీ పార్వతి

Lakshmi Parvathi: వైఎస్సార్ సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై పైర్ అయ్యే వారిలో ఆమె ఒక్కరు. ఏదో ఒక సందర్బంగాలో బాబుపై మండిపడుతుంటారు. తాజాగా చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lakshmi Parvathi: వైఎస్సార్ సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై పైర్ అయ్యే వారిలో ఆమె ఒక్కరు. ఏదో ఒక సందర్బంగాలో బాబుపై మండిపడుతుంటారు. తాజాగా చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP నుంచి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి: లక్ష్మీ పార్వతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దేశంలోనే చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ పొలిటికల్ హీట్ ఉంటుంది. ఇక్కడ ఎన్నికలు లేకున్న సరే.. ఆ స్థాయిలో నిత్యం రాజకీయ రణరంగం సాగుతోంది. ఈ విధానం గత కొన్నేళ్లుగా ఉంటున్నప్పటికీ.. వైసీపీ, టీడీపీ మధ్య మాత్రం వార్ మరోస్థాయిలో ఉంది. కురుక్షేత్రానికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఏపీ రాజకీయాలు ఉన్నాయి.  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తుంటే.. చంద్రబాబు రాజకీయ చరిత్ర గురించి వైసీపీ నేతలు అదేస్థాయిలో కౌంటర్లు ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాజాగా  వైఎస్సార్ సీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వం అంటూ ఆమె మండిపడ్డారు.

శుక్రవారం విజయవాడలో నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యక్తిత్వం, ఆయన రాజకీయ జీవితం గురించి తెలిపారు. అంతేకాక బాబుకు సంబంధించిన పలు అంశాలపై లక్ష్మీపార్వతి ప్రశ్నలు కురిపించారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు రూ.6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడం మనం చూశామని, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని ఆ పార్టీకే తాకట్టుపెట్టాడని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయ్యాలని, అధికారం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు దుర్మార్గుడని టీడీపీ కార్యకర్తలు గ్రహించాలని, చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ కుటుంబంలో ఉండకూడని ఎన్నీఆర్ అన్నారని ఆమె గుర్తు చేశారు. టీడీపీ నుంచి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలని, ఎల్లో మీడియాని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ..” వ్యవస్థలను మేనేజ్ చేయండలో బాబు దిట్ట. అలాంటి వ్యక్తి వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ పార్లమెంట్ లో చెప్పగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. గంటసేపు ఢిల్లీలో చంద్రబాబు కనిపించలేదు. వెంటనే ఒక ఫేక్ సర్వే బయటకు వచ్చింది.  అలాంటి వాటిల్లో చంద్రబాబు దిట్ట.  ఎన్టీఆర్ కీ, పిల్లలకీ మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు జగన్ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాడు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుని అమిత్ షా కలవలేదు. కలిస్తే ఆ ఫోటో చూపించాలి. చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు. అందుకే అన్నిసీట్లనూ కూడా బీజేపీకి ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు.  కేసుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు బీజేపీతో కలవబోతున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలతో ఎండ్ కార్డు పడుతుంది” అని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. మరి.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి