iDreamPost

కన్న తల్లిదండ్రులపై కొడుకు దారుణం.. ఏం చేశాడో తెలిస్తే అస్సలు నమ్మలేరు!

కన్న తల్లిదండ్రులపై కొడుకు దారుణం.. ఏం చేశాడో తెలిస్తే అస్సలు నమ్మలేరు!

ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు ఆస్తుల కోసం ఎంతకైనా తెగించేస్తున్నారు. చివరికి చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే.. ఏపీలో తాజాగా ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. కన్న తల్లిదండ్రులు అని చూడకుండా ఓ యువకుడు ఎవరూ ఊహించని పనికి తెర లేపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. కన్న తల్లిదండ్రులపై కొడుకు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని మల్లేపల్లి గ్రామంలో నాగేశ్వరరావు-లక్ష్మీదేవి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, వీరి చిన్న కుమారుడైన తిప్పరాజు తల్లిదండ్రులను తరుచు వేధిస్తుండేవాడు. ఉన్న ఆస్తిని నా పేరు మీద రాయాలంటూ గత కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులను టార్చర్ చేస్తున్నాడు. కానీ, తల్లిదండ్రులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో తిప్పిరాజు ఎలాగైనా తల్లిదండ్రుల ఆస్తిని నా పేరు రాసుకునేలా అనేక ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఇతగాడికి ఓ ఐడియా తట్టింది. తల్లిదండ్రులను కిడ్నాప్ చేసి ఆస్తిని తన పేరు మీద రాసుకోవాలని భావించాడు.

ఇక ఇందులో భాగంగానే తిప్పరాజు పక్కా ప్లాన్ తో కొందరు వ్యక్తులకు సుఫారి ఇచ్చి తల్లిదండ్రులను కిడ్నాప్ చేయాలని అనుకున్నాడు. అయితే, ఇటీవల ఓ రోజు రాత్రి ఆ సుఫారీ గ్యాంగ్ ఆ వద్థ దంపతులను కిడ్నాప్ చేయాలని చూశారు. దీంతో ఆ దంపతులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో గ్రామంలోకి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఈ ఘటనను గమనించి ఆ వృద్ధ దంపతులను రక్షించారు. దీంతో ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను కిడ్నాప్ చేయాలని చూసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: దారుణం.. తండ్రితో గొడవ! ముగ్గురు పిల్లలను కారుతో ఢీకొట్టి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి