iDreamPost

తిరుమల తిరుపతి దేవస్థానానికి కోల్‌కతా భక్తుడి భారీ విరాళం..

ఏడు కొండల మీద వెలసిన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన వారిలో తమకు తోచినంత తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తుంటారు. ఈ క్రమంలో ఓ భక్తుడు పెద్ద మనసుతో భారీ విరాళం అందించారు.

ఏడు కొండల మీద వెలసిన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన వారిలో తమకు తోచినంత తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తుంటారు. ఈ క్రమంలో ఓ భక్తుడు పెద్ద మనసుతో భారీ విరాళం అందించారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి కోల్‌కతా భక్తుడి భారీ విరాళం..

కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలవబడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు తొలగిపోవాలని ఎక్కడెక్కడి నుంచో బస్సుల్లో, రైళ్లలో నలిగిపోయి మరీ ప్రయాణం చేసి వస్తారు. అయితే ఒక్కసారి స్వామి దర్శనం అయ్యాక పడ్డ కష్టాలు, వ్యయప్రయాసలు అన్నీ క్షణాల్లో మాయమైపోతాయి. స్వామి మహత్యం అదే. అన్నదానంలో తృప్తిగా భోజనం చేసి అప్పటి వరకూ పడ్డ కష్టాలను మర్చిపోతారు.

అయితే స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు టీటీడీకి, అన్నదాన ట్రస్టుకు భారీగా విరాళాలు ఇస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తుల ఆకలి తీర్చే అన్నదానం ట్రస్టుకు, టీటీడీకి తమకు తోచినంత విరాళాలు ఇస్తుంటారు. ఈ క్రమంలో కోల్కతాకు చెందిన రాచిత్ పోద్దార్ అనే భక్తుడు భారీ విరాళం అందించారు. ఎస్వీ అన్నదానం ట్రస్టుకు 10 లక్షల వెయ్యి రూపాయల చెక్ ను విరాళంగా ఇచ్చి పెద్ద మనసును చాటుకున్నారు. తిరుపతికి చెందిన తన ప్రతినిధి రాఘవేంద్ర ద్వారా ఈ చెక్ ను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇదిలా ఉంటే తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి.

ఉదయం సుప్రభాతంతో వెంకటేశ్వర స్వామి వారిని మేల్కొపిన ఆలయ అర్చకులు.. ఆ తర్వాత తోమాల సేవ, సహస్రనామార్చన సేవలను నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణసమేత కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం సేవను నిర్వహించారు. ఈ సేవలో భాగంగా ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, తేనె, చందనంతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీరామచంద్ర పుష్కరిణిలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి తెప్పపై విహరించి భక్తులను కనువిందు చేశారు. మరి కోల్కతాకు చెందిన భక్తుడు టీటీడీకి 10 లక్షల వెయ్యి రూపాయలు విరాళం ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి