iDreamPost

కాకినాడ: మాజీ MLA ఇంట్లో చోరీ.. తాళం పగులగొట్టి మరీ

  • Published Oct 26, 2023 | 1:41 PMUpdated Oct 26, 2023 | 1:41 PM

సమాజంలో దొంగల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. తాళం వేసిన ఇల్లు కనపడితే చాలు గుల్ల చేస్తున్నారు దొంగలు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఆ వివరాలు..

సమాజంలో దొంగల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. తాళం వేసిన ఇల్లు కనపడితే చాలు గుల్ల చేస్తున్నారు దొంగలు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఆ వివరాలు..

  • Published Oct 26, 2023 | 1:41 PMUpdated Oct 26, 2023 | 1:41 PM
కాకినాడ: మాజీ MLA ఇంట్లో చోరీ.. తాళం పగులగొట్టి మరీ

పండగల వేళ చోరీలు భారీగా పెరుగుతాయి. చాలా మంది జనాలు పండగ కోసం సొంత ఊర్లకు తరలి వెళ్తారు. ఇదే అదునుగా భావించి దొంగలు తమ చేతికి పనికి కల్పిస్తారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని.. చోరీలకు పాల్పడతారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే తిరుమాని సత్యలింగ నాయకర్‌ ఇంట్లో చోరీ జరిగింది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తూరంగి జయప్రకాష్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే తిరుమాని సత్యలింగ నాయకర్ ఇల్లు ఉంది.‌ అయితే ఈనెల 14న ఇంటికి తాళం వేసి.. కుటుంబ సభ్యులు కెనడాలో ఉంటున్న కుమార్తె దగ్గరికి వెళ్లారు. ఇక ఇదే అదునుగా భావించిన దుండగులు తమ చేతికి పని చెప్పారు.

ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజాము ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి తలుపును పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగలు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 16 గ్రాముల బంగారం, కొంత నగదు దొచుకెళ్లినట్లు అక్కడే పనిచేస్తున్న దేవరాజు  అనే వ్యక్తి తెలిపాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్‌ టీమ్‌ను పంపి పరిశీలించారు.

తిరుమాని సత్యలింగ నాయకర్ విషయానికి వస్తే.. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగారు. వివాద రహితుడిగా, నిజాయితీపరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 1968లో సర్పంచ్‌గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించాక ఆ పార్టీలో చేరి.. అప్పటి సంపర నియోజకవర్గం (ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం) నుంచి ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాత 1985, 1994లో కూడా సంపర నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. 1986 నుంచి 1989 వరకు రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. రాష్ట్రంలో మత్స్యకార సమస్యల పరిష్కారానికి కృషి చేసి, వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత నాయకర్‌కే దక్కింది. ఇక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి