iDreamPost
android-app
ios-app

బుల్లితెరపై భలే పోటీ

బుల్లితెరపై భలే పోటీ

సినిమాల పోటీ ఎప్పుడూ ఉండేదే కానీ ఇప్పుడు బుల్లితెర ఛానల్స్ మధ్య రేటింగ్ యుద్ధం కొనసాగుతోంది. అధిక శాతం సీరియల్స్ మీద ఇంతకాలం నెట్టుకొచ్చిన ఈ ఎంటర్ టైన్మెంట్ ఛానళ్లు ఇప్పుడు రియాలిటీ షోల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. అందులో భాగంగా భారీ రెమ్యునరేషన్లకు వెనుకాడకుండా మరీ స్టార్లను తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ ఈ కారణంగానే సక్సెస్ అవ్వడం చూశాం. ఇప్పుడు జెమినీ ఒకేసారి రెండు అలాంటి భారీ ప్రోగ్రాములతో జనాన్ని ఆకట్టుకునే ప్లాన్లు వేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరుడు త్వరలోనే ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాని తాలూకు సెలక్షన్లు జరుగుతున్నాయి.

ఇక విజయ్ సేతుపతి-తమన్నా కాంబినేషన్ లో వస్తున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టుకుంది. ఇప్పుడు ప్రోమోలు కట్ చేసి త్వరలోనే పార్టీసిపెంట్స్ ని ఆహ్వానించబోతున్నారు. చిన్ని తెరపై విజయ్ సేతుపతి మొదటిసారి కనిపించనుండటంతో ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేగుతోంది. అయితే ఇద్దరూ కలిసి దీన్ని హోస్ట్ చేస్తారా లేక తమిళ వెర్షన్ కు విజయ్ సేతుపతి తెలుగుకు తమన్నా విడిగా చేస్తారా అనే క్లారిటీ ఇంకా రాలేదు. టీజర్ వచ్చాక కన్ఫర్మ్ అవుతుంది. ఏది ఏమైనా ఇలా తారలు పోటీపడి మరీ ఇలాంటి వాటికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.

డబుల్ మీనింగ్ జోకులుతో వెగటు పుట్టించే పైత్యపు కామెడీ షోల కన్నా పైన చెప్పిన ప్రోగ్రాముల వల్ల జ్ఞానం ఉత్సాహం రెండూ వస్తాయి. ఎవరు మీలో కోటీశ్వరుడు గతంలో చూసిన ప్రోగ్రామే అయినప్పటికి తారక్ డీల్ చేస్తున్నాడు కాబట్టి అంచనాలు వేరుగా ఉంటాయి. ఇక మాస్టర్ చెఫ్ తరహా వంటల కార్యక్రమం కనివిని ఎరుగని కొత్తదని చెప్పలేం కానీ దీన్ని నడిపే విధానం మాత్రం కొత్తగా ఉంటుంది. హిందీలో పదమూడు సీజన్లు ఈ కారణంగానే సక్సెస్ అయ్యాయి. మొత్తానికి జై లవకుశలో రావణ vs ఉప్పెన రాయణం పోటీ ఎలా ఉండబోతోందో మరి కొద్దిరోజుల్లో తేలిపోనుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి