Somesekhar
దేవర మూవీ రిలీజ్ కు ఇంకా రెండు నెలలే టైమ్ ఉంది. దాంతో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదీకాక ఇంకో విషయంలో కూడా దేవర జాగ్రత్త పడాలి, లేకపోతే చిక్కులు తప్పవు అంటున్నారు సినీ పండితులు. ఆ వివరాల్లోకి వెళితే..
దేవర మూవీ రిలీజ్ కు ఇంకా రెండు నెలలే టైమ్ ఉంది. దాంతో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదీకాక ఇంకో విషయంలో కూడా దేవర జాగ్రత్త పడాలి, లేకపోతే చిక్కులు తప్పవు అంటున్నారు సినీ పండితులు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
‘దేవర’.. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే చిత్రాల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే IMDB ప్రకటించింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ.. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రెండు పార్ట్ లుగా దేవర రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ఇంకా 60 రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. ప్రమోషన్ల విషయంలో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటుగా ఇంకో విషయంలో కూడా దేవర జాగ్రత్త పడాలి, లేకపోతే చిక్కులు తప్పవు అంటున్నారు సినీ పండితులు.
సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో.. దాన్ని సరిగ్గా పబ్లిసిటీ చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా అంతే కష్టం. ఈ క్రమంలో కొంచెం తేడా కొట్టిన అది.. సినిమా ఫలితంపైనే ప్రభావం చూపుతుంది. అందుకే పక్కా ప్లానింగ్స్ తో మేకర్స్ బరిలోకి దిగుతుంటారు. అయితే ఈ విషయంలో దేవర కూడా ముందే మేల్కొంటే మంచిదని ఫ్యాన్స్ తో పాటుగా సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవరను జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అటెన్షన్ గా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే రెండు వారాల గ్యాప్ లోనే అంటే అక్టోబర్ 10న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘కంగువ’ రాబోతోంది. దాంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మూడో వారం దేవర కొనసాగడం కాస్త కష్టమనే చెప్పాలి. అందుకే రెండు వారాల్లోనే తారక్ వీలైనంత ఎక్కువ వసూళ్లు కొల్లగొట్టాలి. ఆ తర్వాత కంగువ వస్తుంది కాబట్టి ఎలాగో అక్కడ థియేటర్లు, కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కంగువ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలో దేవర నిర్మాతలు అగ్రిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే థియేటర్లను రెండు వారాలకే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దాంతో వసూళ్లు ప్రభావితం అవుతాయి. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే.. చిక్కులు తప్పవు. ఇక ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండగా.. పార్ట్ 2లో బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నాడు. తొలి భాగంలోనే అతడికి సంబంధించిన కొన్ని సీన్లు కూడా ఉన్నాయట. కాగా.. షూటింగ్ కాస్త పెండింగ్ లో ఉన్నప్పటికీ.. పబ్లిసిటీ చేస్తూ, మూవీపై బజ్ పెరిగేలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.