iDreamPost
android-app
ios-app

దేవర సినిమాలోకి యానిమల్ నటుడు.. ఇక్కడే మరో సూపర్ ట్విస్ట్!

  • Published Jul 25, 2024 | 12:43 PM Updated Updated Jul 25, 2024 | 12:43 PM

Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి క్రేజ్ అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా మరో న్యూస్ సూపర్ ట్విస్ట్ తో వైరల్ అవుతోంది.

Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి క్రేజ్ అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా మరో న్యూస్ సూపర్ ట్విస్ట్ తో వైరల్ అవుతోంది.

  • Published Jul 25, 2024 | 12:43 PMUpdated Jul 25, 2024 | 12:43 PM
దేవర సినిమాలోకి యానిమల్ నటుడు.. ఇక్కడే మరో సూపర్ ట్విస్ట్!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు రాగా.. ఇటీవలే కల్కి2898 ఏడీ వచ్చింది.  త్వరలో మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో సినీ ప్రియులు కూడా కొన్ని సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్ రానున్న దేవర మూవీ. ఈ సినిమా  గురించి వచ్చే అప్ డేట్స్ కోసం ఈగర్ గా చూస్తుంటారు. ఈ క్రమంలోనే దేవర మూవీకి సంబంధించి  ఓ న్యూస్ వైరల్ అవుతుంది. విలన్ గా  యానిమల్ మూవీ నటుడిని దింపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో ట్విట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ దేవర్ ఫ్రాంచేజ్ లోకి మరో నటుడు చేరనున్నట్లు తెలుస్తోంది. యానిమల్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ దేవర్ సినిమాలో యాడ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాస్తా తక్కువ నిడివిలో బాబీ డియోల్ కనిపించబోతున్నట్లు  టాక్ వినిపిస్తోంది. దీంతో దేవర సినిమాతో బాబీ డియోల్ తెలుగు తెరకు తొలిసారి పరిచయం కానున్నారు. దేవర-1 లో తక్కువ సమయం మాత్రమే కనిపించనున్న బాబీడియోల్.. దేవర సీక్వెల్ లో కీలకమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే తారక్ నటిస్తున్న రెండు సినిమాలకు ఈ యానిమల్ విలన్ పేరు వినిపించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే మేకర్స్ నుంచి క్లారిటీ వస్తే మాత్రమే నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

ఇటీవలే  ఈ సినిమా ఓ డైలాగ్ లీక్ అయిన సంగతి తెలిసింది. “సాదా సీదా మగాళ్ళు కావాలా..ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా…!” అనే డైలాగ్ లీక్ అయ్యింది. గూస్ పంప్స్ తెప్పిస్తున్న ఈ డైలాగ్.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే దేవర సినిమా ప్రమోషన్ల కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఈగర్ గా ఉన్నారు. మొత్తంగా యానిమల్ సినిమాతో  అందరిని ఆకట్టుకున్న బాబీ డియోల్..తారక్ సినిమాలోను కనిపించనున్నాడనే వార్తతో దేవరపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఆయన రోల్ ఎలా ఉంటుందా?  అని తెలుసుకునేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss