iDreamPost
android-app
ios-app

ఆ సినిమా అద్భుతం! బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా పొగడ్తలు

  • Published Jul 26, 2024 | 4:30 PM Updated Updated Jul 26, 2024 | 4:30 PM

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బ్రిటిష్ నటి, మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్రినా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బ్రిటిష్ నటి, మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్రినా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

  • Published Jul 26, 2024 | 4:30 PMUpdated Jul 26, 2024 | 4:30 PM
ఆ సినిమా అద్భుతం! బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా పొగడ్తలు

బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతోమంది మోడల్స్ గా కెరీర్ మొదలు పెట్టి తర్వాత హీరోయిన్లుగా మారారు. అలాంటి వారిలో కత్రినా కైఫ్ ఒకరు. తండ్రి కశ్మీరీ.. తల్లి బ్రిటన్ కి చెందినవారు. ఆమె బాల్యం మొత్తం బ్రిటన్ లోనే కొనసాగింది. స్టార్ మోడల్ గా పేరు తెచ్చుకున్న కత్రినాకు అనూహ్యంగా బాలీవుడ్ లో ఛాన్స్ దక్కింది. తెలుగులో విక్టరీ వెంకటేశ్ నటించిన ‘మల్లీశ్వరి’ మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ఇటీవల తన సహ నటుడు విక్కీ కౌశిల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా కత్రినా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ తన సహనటుడు విక్కీ కౌశిల్ ని పెళ్లి చేసుకున్న తర్వాత తమిళ స్టార్ నటుడు విజయ్ సేతు‌పతితో కలిసి మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించింది. తాజాగా విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం‘మహరాజ’ మూవీని వీక్షించిన కత్రినా ఈ మూవీ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్‌ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. ‘వాట్ ఏ ఫిల్మ్, మూవీ చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ కథ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది’ అని పేర్కొంది.నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహరాజ’ మూవీలో విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహనదాస్, అభిరామి, దివ్య భారతి తదితరులు నటించారు. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

బాక్సీఫ్ వద్ద సూపర్ హిట్ విజయం అందుకున్న మహరాజ మూవీ.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. రికార్డు వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. కథ విషయానికి వస్తే.. మహచాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. ఓ ప్రమాదంలో భార్యను పోగొట్టుకుంటాడు. అతని జీవితంలో కూతురు. బిడ్డతో కలిసి సిటీకి దూరంగా ఉంటాడు. అనుకోని సంఘనతో మహరాజ పోలీస్ స్టేషన్ గడప తొక్కుతాడు. ముగ్గురు అగంతకులు తన ఒంట్లో చొరబడి దాడి చేసి.. తన బిడ్డ ప్రాణాలు కాపాడిన లక్ష్మిని ఎత్తుకు వెళ్లారని ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా తన లక్ష్మిని తనకు వెతికి పెట్టాలని చెబుతాడు. మహరాజ చెప్పిన ఆ లక్ష్మి ఎవరు? ఎవరు ఎత్తుకెళ్తారు? పోలీసు ఆ కేసును ఎలా ఛేదిస్తారు? మహరాజపై దాడి చేసిన ముగ్గురు అగంతకులు ఎవరు? వాళ్లతో మహరాజకు ఉన్న విరోదం ఏంటీ? అనే ఆసక్తికర అంశాలతో మూవీ తెరకెక్కించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss