iDreamPost
android-app
ios-app

యంగ్ టైగర్ పై జాన్వీ ప్రశంసలు.. నాకు 10 రోజులు.. NTRకు ఒక సెకన్ అంటూ..

  • Published Jul 26, 2024 | 10:47 AM Updated Updated Jul 26, 2024 | 10:47 AM

Janhvi Kapoor praised Jr. NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఆ విషయంలో తారక్ కు ఒక సెకన్ చాలు.. నాకైతే 10 రోజులు పడుతుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Janhvi Kapoor praised Jr. NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఆ విషయంలో తారక్ కు ఒక సెకన్ చాలు.. నాకైతే 10 రోజులు పడుతుందని చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 26, 2024 | 10:47 AMUpdated Jul 26, 2024 | 10:47 AM
యంగ్ టైగర్ పై జాన్వీ ప్రశంసలు.. నాకు 10 రోజులు.. NTRకు ఒక సెకన్ అంటూ..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘దేవర’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. తొలి సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రెండు భాగాలుగా రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ క్రమంలో తాజాగా జాన్వీ నటించిన మూవీ ‘ఉలజ్’ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది.

జాన్వీ కపూర్ లేటెస్ట్ గా నటించిన మూవీ ‘ఉలజ్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా జాన్వీ కపూర్ మీడియాతో ముచ్చటించింది. “తెలుగులో నా ఫస్ట్ మూవీనే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటించడం నా అదృష్టం. మా ఇద్దరిపై ఇటీవలే ఓ పాటను తెరకెక్కించారు. ఎన్టీఆర్ డ్యాన్స్ ఇరగదీశారు. ఆయన స్టెప్పులు వేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను. ఏదైనా నేర్చుకోవడానికి ఎన్టీఆర్ కు ఒక్క సెకన్ చాలు. అదే నాకైతే.. పది రోజులు పడుతుంది. ఇక ఆయన సెట్ లోకి వచ్చే అందరికి ఎనర్జీ వస్తుంది. అందరిని ఉత్సాహపరుస్తారు. రెండో పాట కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను” అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.

ఇక తెలుగు వారితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది, వారు కళను, సినిమాను గౌవిస్తారు, ఎంతో హుందాగా ఉంటారు అంటూ పొగడ్తలు కురిపించింది ఈ ముద్దుగుమ్మ. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన దేవర.. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ డ్యాన్స్ కు ఫిదా అయ్యి.. ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet