iDreamPost
android-app
ios-app

Devara: దేవర కొత్త డేట్ రిలీజ్! 5 రోజుల విధ్వంసానికి అదిరే ప్లాన్!

  • Published Feb 16, 2024 | 5:06 PM Updated Updated Feb 17, 2024 | 5:16 PM

టాలీవడ్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ "దేవర" గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.

టాలీవడ్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ "దేవర" గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.

  • Published Feb 16, 2024 | 5:06 PMUpdated Feb 17, 2024 | 5:16 PM
Devara: దేవర కొత్త డేట్ రిలీజ్! 5 రోజుల విధ్వంసానికి అదిరే ప్లాన్!

ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ “దేవర” అని అందరికి తెలుసు. అయితే, ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత తారక్ వెండితెరపై దర్శనం ఇచ్చి చాలా కాలం అయింది. దీనితో తమ అభిమాన హీరోను తెరపైన చూడాలని అటు తారక్ అభిమానులతో పాటు.. ఇటు నార్మల్ ఆడియన్సు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “దేవర” గురించి ఇప్పటివరకు ఎన్నో టాక్స్ వింటూ వస్తున్నాం. ఇప్పటికే రిలీజ్ చేసిన దేవర గ్లిమ్ప్స్ అందరికి ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురుచూసే ఆడియన్సుకు తాజాగా .. ఈ  సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. .

కొరటాల శివ దర్శకత్వంలో .. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం “దేవర”. ఈ చిత్రం రెండు పార్ట్శ్ గా ఉండబోతుందని. ఇప్పటికే షూటింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నట్లు .. ఇలా అనేక రకాల అప్ డేట్స్ తో, ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్ప్స్ తో దేవర చిత్రం పైన .. భారీ ఎక్స్పెక్టషన్స్ పెరిగిపోయాయి. అయితే, దేవర పార్ట్ -1 ను ఈ ఏడాది విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు మేకర్స్. రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూసే వారికి, వారి సినిమా  ఎప్పడు రిలీజ్ చేస్తే .. బాగా క్లిక్ అవుతుందా అని ఆలోచించి సరిగ్గా సరైన టైం లో “దేవర పార్ట్-1” ను థియేటర్ లో విడుదల చేస్తున్నారు. స్వయంగా తారక్ ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది “అక్టోబర్ 10” న “దేవర పార్ట్-1” చిత్రం థియేటర్ లలో భారీ అంచనాల మధ్యన విడుదల కానుంది. సాధారణంగానే తారక్ చిత్రానికి.. ముందుగానే భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారం చూసినట్లైతే సినిమా విడులైన మొదటి రెండు రోజుల్లోనే భారీ కలెక్టన్లు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక అది పండుగ సమయం కాబట్టి అందరూ కుటుంబంతో సహా థియేటర్స్ కు వెళ్లి చూడడం పక్కా. కాబట్టి ఈ లెక్కన ఆ ఐదు రోజులు అన్ని థియేటర్స్  లో ఎన్టీఆర్ అభిమానులు .. విధ్వసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తీరాలి.

ఇక ఎట్టకేలకు దేవర రిలీజ్ డేట్ ను విడుదల చేశారు కాబట్టి.. అభిమానులంతా చాలా కాలం తర్వాత తారక్ ను వెండితెరపై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా పై ఇంకా ఎటువంటి అప్ డేట్స్ వస్తాయా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో తారక్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి, తాజాగా “దేవర పార్ట్-1” రిలీజ్ డేట్ గురించి వచ్చిన అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet