iDreamPost

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక వారికి కూడా రూ. 10వేలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రచారాల జోరు కూడా ఊపందుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి కోసం ఓ హమీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రచారాల జోరు కూడా ఊపందుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి కోసం ఓ హమీ ఇచ్చారు.

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక వారికి కూడా రూ. 10వేలు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మే 13న ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారాలను సాగిస్తున్నాయి. ఈసారి తామే అధికారాన్ని చేపట్టేది అని జనసేన, టీడీపీ, బిజెపీ ఉమ్మడి కూటమి భావిస్తుంటే.. మరో సారి కూడా ప్రజలు తమకే అధికార పీఠాన్ని అప్పగించబోతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్దం’ పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా చిన్న శింగనమల లారీ, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లతో జగన్ ముఖా ముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ టిప్పర్ డ్రైవర్‌కు ఎమ్మెల్యే సీటు ఇచ్చానని గుర్తు చేసిన సీఎం జగన్.. కీలక ప్రకటన చేశారు. ఇకపై సొంత టిప్పర్, లారీ ఉన్న డ్రైవర్లకూ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఏటా రూ. 10వేల రూపాయల సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఆటో, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేలు చొప్పున ఇస్తుండగా.. ఇకపై లారీ, టిప్పర్ యజమానులు కూడా ఈ సాయాన్ని పొందనున్నారు. కాగా, శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఓ టిప్పర్ డ్రైవర్ అని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు జగన్ మోహన్ రెడ్డి.

Good news for tipper drivers

వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, మీ హయంలో ఉద్యోగం రాకపోయినా.. టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పారు. కోట్లు కోట్లు కుమ్మరించే వారికి టీడీపీ సీటు ఇస్తుందన్న ఆయన..టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా లారీ, టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన జగన్.. వాహన మిత్ర పథకంలో భాగంగా ఈ వాహనాల యజమానులకు కూడా పదివేల రూపాయల చొప్పున ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఇప్పటి వరకు ఆటో, టాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు రూ. 10వేల చొప్పున ఐదేళ్లలో రూ. 50 వేల సాయం అందించమన్నారు. వాహన మిత్ర ద్వారా రూ. 1296 కోట్లు ఇచ్చామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి