iDreamPost

నాని సినిమా విడుదల – నిజంగా జరగనుందా ?

నాని సినిమా విడుదల – నిజంగా జరగనుందా ?

ఉన్నట్టుండి నిన్న సోషల్ మీడియాలో నాని కొత్త సినిమా టక్ జగదీశ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. కారణం ఇది ఓటిటిలో డైరెక్ట్ ప్రీమియర్ కాబోతోందని థియేటర్ల పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యేలా కనిపించకపోవడంతో నిర్మాతలు తప్పనిసరై ఈ నిర్ణయం తీసుకున్నారని కొన్ని వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ సైతం దీన్ని పోస్ట్ చేయడమే. క్షణాల్లో ఇది కాస్తా వైరల్ గా మారిపోయి అసలు నిజంగా ఇది డిజిటల్ వస్తుందా అనే అనుమానానికి తెర తీసింది. ఇంత జరుగుతున్నా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఓన్లీ ఇన్ థియేటర్స్ లాంటి సందేశం కానీ పోస్టర్ కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ మాటకొస్తే టీమ్ గత పది రోజులకు పైగా చాలా మౌనంగా ఉంది.

దీని వెనుక కొన్ని సహేతుకమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం టక్ జగదీష్ కు అమెజాన్ ప్రైమ్ సుమారు నలభై కోట్ల దాకా ఆఫర్ ఇచ్చిందట. అంత మొత్తం షేర్ గా రావడం ఇప్పుడున్న క్లిష్టమైన పరిస్థితుల్లో అసాధ్యం. అందుకే ఓటిటికి మొగ్గు చూపక తప్పకపోవచ్చని ఒక వెర్షన్ వినిపిస్తోంది. పైగా నెలాఖరు దాకా ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేలా లేదు. మరోవైపు కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేరళ స్థాయిలో లేకపోయినా ఇది సింపుల్ గా కొట్టిపారేసే అంశం కాదు. ఇప్పటికే నాలుగు నెలలు వెయిటింగ్ లో ఉన్న టక్ జగదీశ్ ఇక ఆలస్యాన్ని భరించలేకే డిజిటల్ అన్నట్టు సమాచారం


అధికారికంగా చెప్పేదాకా ఇదంతా నిజమని చెప్పలేం కాబట్టి నానినో లేక దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇస్తే బెటర్. లేదూ ఇది వాళ్ళ వ్యవహారం కాదు అనుకుంటే సన్ షైన్ సంస్థ నుంచి ఒక నోట్ వస్తే ఈ ప్రచారానికి చెక్ పడుతుంది. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. రిలీజ్ సంగతి తేలాకే దీన్ని బయటికి తేబోతున్నారు. గత ఏడాది వికి కూడా ఇదే తరహా చర్చలు జరిగాక ఫైనల్ గా ప్రైమ్ లో వచ్చింది. మరో టక్ జగదీష్ ఇదే రూట్ పట్టక తప్పదా లేక బిగ్ స్క్రీన్ పై వస్తాడా. చూద్దాం

Also Read : ప్రభాస్ సినిమా ప్లానింగ్ అదిరింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి