iDreamPost

Video: సింగర్ స్మిత ఇంట్లో స్పెషల్ అకేషన్! గెస్ట్ గా హీరో నాని!

  • Published Apr 20, 2024 | 6:25 PMUpdated Apr 20, 2024 | 6:25 PM

టాలీవుడ్ ప్రముఖ ఎక్టర్ అండ్ స్మిత తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు తన గాత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్మితా.. ఇప్పుడు అంతగా ఏ సినిమాల్లో కనిపించడం లేదు. కానీ, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా స్మిత ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగదా జరిగాయి. అయితే ఈ వేడుకలకు టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో హాజరయ్యాడు. ఇంతకి ఆయన ఎవరంటే..

టాలీవుడ్ ప్రముఖ ఎక్టర్ అండ్ స్మిత తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు తన గాత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్మితా.. ఇప్పుడు అంతగా ఏ సినిమాల్లో కనిపించడం లేదు. కానీ, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా స్మిత ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగదా జరిగాయి. అయితే ఈ వేడుకలకు టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో హాజరయ్యాడు. ఇంతకి ఆయన ఎవరంటే..

  • Published Apr 20, 2024 | 6:25 PMUpdated Apr 20, 2024 | 6:25 PM
Video: సింగర్ స్మిత ఇంట్లో స్పెషల్ అకేషన్! గెస్ట్ గా హీరో నాని!

సింగర్ స్మిత.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో ఓ గాయనిగా, నటిగా, మంచి డ్యాన్సర్ గా అలాగే సామాజిక సేవకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చకుంది. ముఖ్యంగా తన అద్భుతమైన గాత్రంతో పాప్స్ సాంగ్స్ తో అప్పటిలో యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే ప్రస్తుతం స్మితా ఏ సినిమాల్లో నటించడం కానీ, పాడటం కానీ చేయడం లేదు. ఎక్కువగా తన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇక ఇండస్ట్రీకి దూరమైన స్మిత అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ.. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్మిత ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగదా జరిగాయి. అయితే ఈ వేడుకలకు టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో హాజరయ్యాడు. ఇంతకి ఆయన ఎవరంటే..

టాలీవుడ్ ప్రముఖ ఎక్టర్ అండ్ స్మిత తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు తన గాత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్మితా.. ఇప్పుడు అంతగా ఏ సినిమాల్లో కనిపించడం లేదు. కానీ, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత విషయాలను, అలాగే ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్మిత ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా.. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి న్యాచురల్ స్టార్ నాని తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరవ్వడం గమన్హారం. కాగా, ఈ వేడుకల్లో నాని దంపతులు పాల్గొని స్వామివారికి తలంబ్రాలు పోసి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను స్మిత అమ్మగారు జోగు ప్రసాద్  సోషల్ మీడియాలో షేర్ చేశారు. పైగా ఆ వీడియోకు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అని క్యాప్షన్  కూడా జోడించారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఇదిలా ఉంటే..  నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా విడుదలై  నిన్న అనగా శుక్రవారం ఏప్రిల్ 19తో  ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా నాని సతీమణి అంజనా కూడా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయితే అందులో.. మొదటిసారి థియేటర్ లో జెర్సీ సినిమా చూసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సినిమాలోని సీన్స్ నన్ను ఎంతగానో భావోద్వేగానికి గురి చేస్తాయి. అలాగే మా అబ్బాయి అర్జున్ ఇప్పుడిప్పుడే జెర్సీ థీమ్ సాంగ్ పై పియానో వాయించడం నేర్చుకుంటున్నాడు’ అంటూ అంజనా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఇక నాని సినిమా విషయానికొస్తే..  ప్రస్తుతం ఈ న్యాచురల్ హీరో  ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాకి వివేక్‌ ఆత్రేయ దర్శకుడిగా వహిస్తున్నాడు. కాగా, ఇందులో  ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ నటిస్తుంది. వీరితో పాటు ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఇక ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకంపై దానయ్య  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి, సింగర్ స్మిత ఇంట్లో శ్రీరామనవమి వేడకల్లో నాని పాల్గొనడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి