iDreamPost

ఎన్నో ఆశలతో అమెరికా వెళ్తున్న భారతీయ మహిళలు! తీరా అక్కడ మాత్రం!

ఉన్నత విద్య, ఉద్యోగం, భవిష్యత్తుపై ఆశలు, ఆశయాలతో చాలా మంది విదేశాల బాట పడుతున్నారు. కానీ అక్కడకు వెళ్లాక పరిస్థితులు మరోలా మారుతున్నాయి. జాతి వివక్ష, ఇతర ఘటనల కారణంగా పలువురు ఇండియన్స్ మృత్యువాత పడుతున్నారు.

ఉన్నత విద్య, ఉద్యోగం, భవిష్యత్తుపై ఆశలు, ఆశయాలతో చాలా మంది విదేశాల బాట పడుతున్నారు. కానీ అక్కడకు వెళ్లాక పరిస్థితులు మరోలా మారుతున్నాయి. జాతి వివక్ష, ఇతర ఘటనల కారణంగా పలువురు ఇండియన్స్ మృత్యువాత పడుతున్నారు.

ఎన్నో ఆశలతో అమెరికా వెళ్తున్న భారతీయ మహిళలు! తీరా అక్కడ మాత్రం!

విదేశాల్లో భారతీయులకు, భారత సంతతి వ్యక్తులకు రక్షణ కొరవడింది. ఇటీవల జరిగిన పలు ప్రమాదాల్లో ఇండియన్స్ చనిపోయిన సంగతి తెలిసిందే. కెనడాలో బ్రిటీష్ కొలంబియా ఫ్రావిన్స్‌లో ఇండియన్ ఆరిజన్ యువరాజ్ గోయల్ హత్యకు గురయ్యాడు. అంతకు ముందు జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా అమెరికా ప్రాంతంలో జాతి వివక్షత, ఇతర కారణాలతో భారతీయులపై కత్తి దూసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో విదేశాల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యుఎస్‌లోని న్యూజెర్సీలో పంజాబ్‌కు చెంది ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపాడు ఓ దుండగుడు.

కాల్పులు జరిపిన వ్యక్తి భారతీయ సంతతికి చెందిన వాడు గమనార్హం. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. న్యూజెర్సీలోని కార్టెరెట్‌లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్‌ జస్వీర్ కౌర్, గగన్ దీప్ కౌర్‌పై కాల్పుల జరిపాడు. ఈ ఘటనలో జస్వీర్ కౌర్ మరణించింది. గగన్ దీప్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు గిల్ నాకోదర్‌లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని, బాధితులు జలంధర్‌లోని నూర్‌మహల్‌కు సమీపంలోని గోర్సియన్ ప్రాంత వాసులని తెలుస్తోంది. కాగా, జస్వీర్ ను చూసేందుకు వచ్చింది గగన్ దీప్. ఆ సమయంలోనే ఈ కాల్పులు జరిగాయి. నిందితుడు గౌరవ్ గిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, గగన్ దీప్, గౌరవ్‌కు ముందు పరిచయమున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని నకోదర్ పట్టణంలోని IELTS కోచింగ్ సెంటర్‌లో గగన్‌దీప్‌తో గౌరవ్‌కు పరిచయం ఏర్పడింది. ఇటీవల స్టడీ వీసాపై గగన్ దీప్ అమెరికా వెళ్లింది. అతడు అక్కడకు వచ్చినట్లు తెలుస్తుంది. తన చదువుకు సంబంధించిన ఇబ్బందుల గురించి జస్వీర్‌తో చెప్పుకునేందుకు గగన్ ఆమె ఇంటికి వెళ్లింది. అంతలో అక్కడకు వచ్చిన గౌరవ్.. గగన్ దీప్‌తో గొడవపడ్డాడు. ఆ సమయంలో నిద్రలో ఉంది జస్వీర్.. ఈ గొడవలో ఆమె జోక్యం చేసుకోవడంతో జస్వీర్ తలపై ఏడు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి  చెందింది. కాగా జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్‌గా ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేసింది. నిందితుడిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి