iDreamPost
android-app
ios-app

తెలంగాణలో ఇంటి నుంచే ఓటు! ప్రారంభమైన ప్రక్రియ

  • Published May 03, 2024 | 12:11 PMUpdated May 03, 2024 | 12:11 PM

Home Voting: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తుంది. వీధుల్లో ఎన్నికల ప్రచారాలు హూరెత్తిపోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా హూం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.

Home Voting: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తుంది. వీధుల్లో ఎన్నికల ప్రచారాలు హూరెత్తిపోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా హూం ఓటింగ్ ప్రక్రియ మొదలైంది.

  • Published May 03, 2024 | 12:11 PMUpdated May 03, 2024 | 12:11 PM
తెలంగాణలో ఇంటి నుంచే ఓటు! ప్రారంభమైన ప్రక్రియ

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీ నేతలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గతే ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టింది. త్వరలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధిక సీట్లు కైవసం చేసుకోవాలని గట్టి పట్టుమీదే ఉన్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హూం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలోనే అధికారులు అర్హులైన ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే..

పోలింగ్ సమయంలో బూత్ లకు రాలేని పరిస్తితిలో ఉన్న 85 ఏళ్లు దాటిన వృద్దులు, పీడబ్ల్యూడీ (వికలాంగుల) ఓటర్లు హూం ఓటింగ్ అంటే ఇంటి వద్ద నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే పలు పత్యేక బృందాలు ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హూం ఓటింగ్ ప్రక్రియ షురు అయింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 121 మంది ఓట హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 86 మంది సీనియర్ సిటిజన్లు, 35 మంది దివ్యాంగులు ఉన్నారు. ఇప్పటికే అధికారులు అన్నీ సిద్దం చేసుకొని శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ ప్రక్రియ శనివారం పూర్తి అవుతుంది.

ఎన్నికల అధికారులు అర్హులైన ఓటర్ల వద్దకు స్వయంగా వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటింటికి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఓటర్లకు ఫోన్ చేసి, లేదా సమాచారం ఇచ్చి వారి అందుబాటెలో ఉన్నపుడు ఎన్నికల సిబ్బంది ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి హూం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆర్హులైన ఓటర్లు తప్పకుండా అధికారులకు అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రాష్ట్రంలో గురువారం నుంచి లోక్ సభ ఎన్నికలకు హూం ఓటింగ్ వేసే ప్రక్రియ ఎన్నికల అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో శుక్ర, శనివారాల్లో ఓటర్ల సౌలభ్యాన్ని బట్టి వారి ఇంటి వద్దకు వెళ్లి ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఓటు వేసేందుకు 23,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల అధికారలు ఇంటి ఓటింగ్ ను 806 గ్రపులుగా.. 885 రూట్లు గా విభజించి ప్రతి బృందంలో పోలింగ్ అధికారులతో పాటు వీడియో చిత్రీకరణ బృందం కూడా ఉంటుంది. సరైన నేతను ఎంచుకోవాలంటే ఓటు మన ఆయుధం.. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి