iDreamPost

1400 కోట్ల బడ్జెట్ మూవీ.. నెల రోజుల్లోనే OTTలోకి..! డేట్ ఇదే..

FURIOSA : A MAD MAX SAGA: ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద వారం వారం సందడి చేస్తుంటాయి. కొన్ని హిట్ అవ్వగా, మరికొన్ని ఫట్ అంటాయి. అలాంటి అన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అలానే దాదాపు 1400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన డిజాస్టర్ మూవీ త్వరలో ఓటీటీలో రానుంది.

FURIOSA : A MAD MAX SAGA: ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద వారం వారం సందడి చేస్తుంటాయి. కొన్ని హిట్ అవ్వగా, మరికొన్ని ఫట్ అంటాయి. అలాంటి అన్ని సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అలానే దాదాపు 1400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన డిజాస్టర్ మూవీ త్వరలో ఓటీటీలో రానుంది.

1400 కోట్ల బడ్జెట్ మూవీ.. నెల రోజుల్లోనే OTTలోకి..! డేట్ ఇదే..

ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. అందుకు తగ్గట్లే వారం వారం ఎన్నో సినిమాలు ఓటీటీలో సందండి చేస్తున్నాయి. దీంతో ఓటీటీకి సంబంధించిన సమాచారం కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక మూవీ మేకర్స్ కూడా వీలైనంత త్వరగా మూవీలను ఓటీటీలో అందుబాటులోకి తెస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ప్రత్యేకమైన సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. దాదాపు 1400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన డిజాస్టర్ మూవీ త్వరలో ఓటీటీలో రానుంది. డేట్ కూడా ఫిక్స్ అయింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద వారం వారం సందడి చేస్తుంటాయి. కొన్ని హిట్ అవ్వగా, మరికొన్ని ఫట్ అంటాయి. అలానే భారీ బడ్జెట్ తో తెరకెక్కే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడతాయి. అలాంటి సినిమాలు వెంటనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. అలాంటి వాటిల్లో హాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ‘ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా’ అనే మూవీ. 168 మిలియ‌న్ డాల‌ర్ల అంటే మన ఇండియన్ కరెన్సీలో 1400 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. భారీ అంచనాల మధ్య  రిలీజైన ఈ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిస్పాయింట్ చేసింది. కేవలం 150 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అలా మొత్తంగా క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌ సినిమాగా నిలిచింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా ఈ సినిమా ఉండిపోయింది.

ఈ నేపథ్యంలోనే ‘ఫ్యూరియోసా: మ్యాడ్ మ్యాక్స్ సాగా’ మూవీ థియేట‌ర్ల‌లో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. జూన్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే రెంట‌ల్ విధానంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్ ఫ్రాంచైజ్‌ లో ఐదో మూవీగా ‘ఫ్యూరియోసా మ్యాడ్ మాక్స్ సాగా’ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాడ్ మ్యాక్ సిరీస్‌లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ రోడ్ సినిమా 6 ఆస్కార్ అవార్డులను గెల్చుకుంది. ఈ సినిమా 2015లో విడుదలై..ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల కోట్లకుపై వసూళ్లు రాబట్టింది. దాంతో ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్ సాగాపై మూవీపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ప్రేక్షకలు అంచనాలను ఈ సినిమా అందుకోలేక పోయింది.

విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్ బాగున్నా క‌థ‌, క‌థ‌నాలు, యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఎక్కువ‌గా సాగ‌తీయ‌డం, ఇతర పలు అంశాలతో బాక్సాఫీస్ వద్దు ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. భారత దేశంలో ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మాక్స్ సాగా సినిమా ఇర‌వై కోట్ల లోపే  వసూళ్లు సాధించింది. ఇండియాలోనే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ మూవీ.. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్‌ మూవీలో స‌గం మాత్ర‌మే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి డిజాస్టర్ గా మిగిలింది. మ్యాడ్ మ్యాక్ సిరీస్‌లో ఆరు పార్ట్ కు కూడా రానున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా జూన్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను చూడకుండా ఉన్నట్లు అయితే చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి