iDreamPost

బండి తాళాలు లాక్కొని పోలీసులు నన్ను కొట్టారు:  కుమారి ఆంటీ కొడుకు!

Kumari Aunty Son: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఈంటీ బండిని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వ్యాపారం చేసేందుకు వీలు లేదంటూ వారిని అడ్డుకున్నారు.

Kumari Aunty Son: స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారీ ఈంటీ బండిని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వ్యాపారం చేసేందుకు వీలు లేదంటూ వారిని అడ్డుకున్నారు.

బండి తాళాలు లాక్కొని పోలీసులు నన్ను కొట్టారు:  కుమారి ఆంటీ కొడుకు!

కుమారీ ఆంటీ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవిడే ట్రెండింగ్. నిన్నటి వరకు కుమారీ ఆంటీ దగ్గర 5 స్టార్ హోటల్ రేట్లు అంటూ ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆమె ఆదాయం గురించి చెప్పుకొచ్చారు. చిన్నా చితక యూట్యూబ్ ఛానల్స్ నుంచి పెద్ద పెద్ మీడియా సంస్థల వరకు ఆవిడ మీదే ఫోకస్ పెట్టారు. దాంతో నెట్టింట, మీడియాలో కుమారీ ఆంటీ తెగ వైరల్ అయ్యింది. దాంతో రోజుకు 300 ప్లేట్లు అమ్మే కుమారి.. రోజుకు 500 ప్లేట్లు అమ్మే స్థాయికి ఎదిగారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ, ఒక్కసారికి వచ్చిన విపరీతమైన క్రేజ్ ఇప్పుడు ఆమెకు అసలు ఉపాధే లేకుండా చేసింది.

సోషల్ మీడియా సెన్సేషన్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమారి ఆంటీకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. యూట్యూబర్స్, వ్లాగర్స్, మీమర్స్ అంతా కలిసి ఆవిడకు ఎక్కడలేని క్రేజ్ ని తెచ్చిపెట్టారు. ఆవిడ మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది. మన వల్ల ట్రాఫిక్ కి ఇబ్బంది రాకూడదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీవల్ల నా వ్యాపారం పెరిగింది అంటూ అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పింది. కానీ, ఇప్పుడు ఆ క్రేజే ఆమెకు అసలు ఉపాధి లేకుండా చేసింది. ఎప్పటిలాగానే మంగళవారం కూడా ఫుడ్ విక్రయించేందుకు తన ట్రక్కులో అన్ని ఐటమ్స్ తీసుకుని ఐటీసీ హోటల్ రోడ్డులోకి వచ్చింది. ఆమె ఫుడ్ ట్రక్కుని ట్రాఫిక్ పోలీసులు అడ్డగించారు. ఆమె అక్కడ వ్యాపారం చేసేందుకు వీలు లేదంటూ గట్టిగా చెప్పారు. అలాగే ట్రక్కుని అక్కడి నుంచి తీసుకుని పక్కకు తీసుకెళ్లారు.

మొదట ఆ ట్రక్కుని మళ్లీ ఇస్తామంటూ చెప్పారంట. కానీ, తర్వాత సీజన్ చేశామని చెప్పినట్లు కుమారీ ఆంటీ కుమారుడు చెప్పుకొచ్చాడు. అయితే అతనిపై చేయి కూడా చేసుకున్నారంటూ ఆరోపించాడు. తనను గట్టిగా చరుస్తూ చొక్కా పట్టుకుని ఇటు రారా అంటూ లాగారంటూ చెప్పాడు. తనతో దురుసుగా ప్రవర్తించారంటూ చెప్పాడు. కుమారీ ఆంటీ భర్త కూడా తమకు న్యాయం చేయాలంటూ వాపోయారు. బండిలో లక్ష రూపాయలు విలువజేసే సరుకు ఉందని దానిని పోలీసులు సీజ్ చేశారని చెప్పారు. బండిని ఇస్తాంటూ తీసుకెళ్లి.. ఇప్పుడు తాళాలు లాగేసుకుని సీజ్ చేశామని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కుమారీ ఆంటీ కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను కేవలం రోజులో 2 గంటలు మాత్రమే అక్కడ వ్యాపారం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ వీధిలో వ్యాపారం జరుగుతుందని.. తాను కేవలం 2 గంటలు మాత్రమే ఉంటానని. కానీ, అందరినీ వదిలేసి తన వ్యాపారాన్ని మాత్రమే అడ్డుకోవడం అన్యాయం అంటూ వాపోయారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసుల వాదన ఇంకోలా ఉంది. ఇప్పటికిప్పుడు తీసుకున్న యాక్షన్ కాదంటూ పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతుందని ఎప్పటినుంచో చెప్తున్నామంటున్నారు. మరి.. కుమారీ ఆంటీ ఫుడ్ ట్రక్కుని సీజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి