iDreamPost

తారక్ సీరియస్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు.. ఏం జరిగిందంటే?

Jr.NTR- Viral Video: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే తారక్ కు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహంగా కనిపించాడు.

Jr.NTR- Viral Video: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే తారక్ కు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహంగా కనిపించాడు.

తారక్ సీరియస్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు.. ఏం జరిగిందంటే?

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హైదరాబాద్- ముంబయి తిరుగుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు దేవర పార్ట్ 1 షూటింగ్, మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అటు వార్ 2 షూటింగ్ కూడా రెగ్యూలర్ బేసిస్ లో నడుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎక్కువగా విమానాశ్రయంలోనే ఎక్కువ కనిపిస్తున్నాడు. అలాంటి వీడియోలే బాగా వైరల్ కూడా అవుతున్నాయి. అయితే తాజాగా తారక్ వీడియో ఒకటి నెట్టింట ప్రత్యక్షమైంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉగ్రరూపం దాల్చాడు. ఒకరిని ఓయ్ అంటూ సీరియస్ టోన్ లో అరుస్తూ కనిపించాడు. అసలు తారక్ ని అలా చూడటం చాలా అరుదు అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ వీడియో హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఎందుకు అంతలా సీరియస్ అయ్యాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అడపాదడపా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూనే ఉంటాడు. ఎయిర్ పోర్టులోనో.. సినిమా షూటింగ్ లోనో తారక్ ని చూస్తూనే ఉంటారు. కాకపోతే ప్రతిసారి అతను చాలా ప్రశాంతంగా, నవ్వుతూ కనిపిస్తాడు. కానీ, ఈసారి వీడియోలో మాత్రం తారక్ ఆగ్రహంగా కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రరూపం దాల్చాడు. అసలు అలా ఎందుకు జరిగిందా అని అంతా ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే.. తారక్ ప్రస్తుతం వార్ 2 షూట్ తో బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్ మూవీలో నటిస్తున్న ఈ హీరో తన లుక్స్ ని రివీల్ చేయకుండా ఉండాలి అనుకున్నాడు. అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు.

బాలీవుడ్ లో ఈ పెపరాజీ ఫొటోగ్రఫీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఎక్కడున్నా సెలబ్రిటీలను వదిలిపెట్టరు. వెంటపడి విసిగించైనా సరే పిక్స్ తీస్తుంటారు. అలాగే తారక్ ని కూడా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ముందుగానే తారక్ ఫొటోలు వద్దు అని చేతితో సైగ చేశాడు. కానీ, వినకుండా దగ్గరకు వెళ్లి క్లోజ్ గా షూట్ చేస్తుండటంతో.. అసహనంతో తారక్ వారిని ఓయ్ అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాడు. ఈ షార్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. తారక్ అంత సీరియస్ అవ్వడం ఇప్పటివరకు చాలా మంది చూసి ఉండరు. కానీ, తారక్ డెడికేషన్ కి మాత్రం నెటిజన్స్ ఫిదా అయిపోయారు. ఎందుకంటే తన మూవీ లుక్స్ రివీల్ కాకూడదు అని అతను ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు.

ప్రతి యాక్టర్ ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తారక్ బాలీవుడ్ డెబ్యూ కోసం చాలా మంచి ఛాన్స్ ఇది అని ఇప్పటికే చాలానే ప్రశంసలు దక్కాయి. పైగా స్పై యూనివర్స్ కాబట్టి హిందీ ఆడియన్స్ కి తారక్ మరింత దగ్గరవుతాడు అంటున్నారు. అలాగే తర్వాతి మూవీస్ లో తారక్ రోల్ బేస్డ్ గా ఒక ఫుల్ లెంగ్త్ మూవీ కూడా వస్తుంది అంటున్నారు. వార్ 2లో యాక్ట్ చేసినందుకు.. తారక్ కు రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అంటూ బాలీవుడ్ చాలానే వార్తలు వచ్చాయి. మరి.. జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి