iDreamPost

ఇంటి నుండే పని.. రోజుకి 3 గంటలు కష్టపడితే.. 2000 వరకు లాభం! ఈ జాబ్స్ నమ్ముతున్నారా?

మీరు ఉద్యోగం కోసం వెతికే పనిలో పడి వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల్లో చేరుతున్నారా? అయితే జాగ్రత్త మీరు మోసపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మోసగాళ్లు నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు.

మీరు ఉద్యోగం కోసం వెతికే పనిలో పడి వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల్లో చేరుతున్నారా? అయితే జాగ్రత్త మీరు మోసపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మోసగాళ్లు నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు.

ఇంటి నుండే పని.. రోజుకి 3 గంటలు కష్టపడితే.. 2000 వరకు లాభం! ఈ జాబ్స్ నమ్ముతున్నారా?

నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు మోసాగాళ్లు. ఉద్యోగాల పేరిట వల వేసి లక్షలు కాజేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం.. అని మంచి జీతం వస్తుందని అని నమ్మించి నిరుద్యోగులను దోచేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఇలాంటి మోసాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసాలు మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి మోసాలు ఎక్కువైపోయాయి. ఇటీవల హైదరాబాద్ పోలీసులు దాదాపు 700 కోట్ల వర్క్ ఫ్రం హోం స్కాంను బయటపెట్టారు. స్కామర్స్ చేతిలో దాదాపు 15 వేల మంది డబ్బులు పోగొట్టుకుని మోసపోయారు.

మోసాలు ఎప్పుడు కూడా నమ్మకం మాటునే జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఇంటి నుంచే పని అంటూ రోజుకు వేలల్లో సంపాదించొచ్చని స్కామర్స్ మోసాలకు తెరలేపుతున్నారు. కొంతమంది నిరుద్యోగులు వీరి మాయమాటలను నమ్మి వర్క్ ఫ్రం హోంలో చేరి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి స్కామ్ లలో నిరుద్యోగులే కాదు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా బాధితులుగా మిగిలిపోతున్నారు. మోసగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోం జాబ్ చేస్తూ రోజుకు మూడు నుంచి ఐదు వేలు సందించొచ్చని మెసేజ్ లు పంపిస్తూ మోసగాళ్లు సరికొత్త దందాకు తెరలేపారు.

Work from home jobs

ప్రస్తుత రోజుల్లో ఉద్యోగాలకు ఫుల్ కాంపిటీషన్ ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచే పని కల్పించి మంచి జీతం ఇస్తామంటే నమ్మకుండా ఎవరు ఉంటారు చెప్పండి. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు మీరు ఇంటి నుంచే జాబ్ చేయాలనుకుంటున్నారా? రోజుకు మూడు నుంచి 5 వేలు ఈజీగా సంపాదించొచ్చని మెసేజ్ లు పంపిస్తున్నారు. ఇది నమ్మి ఎవరైనా ఆ జాబ్ లో చేరితే అసలు కథ అప్పుడు మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ వీడియోలకు లైక్ చేయడం, గూగుల్ రివ్యూస్ రాయడం, వాటికి రేటింగ్స్ ఇవ్వడం, ఇన్ స్టా లో పోస్టులను లైక్ చేయడం వంటి చిన్న చిన్న పనులను చెబుతారు. ప్రారంభంలో మిమ్మల్ని నమ్మించేందుకు 300, 500 మీ అకౌంట్ లో జమ చేస్తారు.

తర్వాత కొన్ని రోజులకు వాళ్ల టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవమంటారు. వాళ్లు చెప్పే వాటిల్లో పెట్టుబడి పెడితే చాలా లాభాలు వస్తాయని మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమంటారు. ఇక ఆ తర్వాత అసలు మోసం బయటపడుతుంది. లాభాల సంగతి దేవుడెరుగు కానీ.. మీరు ఇన్వెస్ట్ మెంట్ చేసిన తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి రావు. కాబట్టి మీ ఫోన్లకు వచ్చే అనవసరపు మెసేజ్ లను క్లిక్ చేసి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకోకండి. ఒక వేళ వర్క్ ఫ్రం హోం జాబ్ చేయాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి