iDreamPost
android-app
ios-app

చాహల్ భార్యపై దారుణమైన ట్రోల్స్.. పెళ్లి చేసుకుని తప్పు చేశావ్ అంటూ!

  • Published Apr 25, 2024 | 5:43 PM Updated Updated Apr 25, 2024 | 5:43 PM

Trolls On Chahal Wife Dhanasri: చాహల్ భార్య ధనశ్రీ ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె మీద విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అసలు చాహల్ ఆమెను పెళ్లి చేసుకుని తప్పు చేశాడంటూ.. హద్దు మీరి మాట్లాడుతున్నారు.

Trolls On Chahal Wife Dhanasri: చాహల్ భార్య ధనశ్రీ ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె మీద విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అసలు చాహల్ ఆమెను పెళ్లి చేసుకుని తప్పు చేశాడంటూ.. హద్దు మీరి మాట్లాడుతున్నారు.

  • Published Apr 25, 2024 | 5:43 PMUpdated Apr 25, 2024 | 5:43 PM
చాహల్ భార్యపై దారుణమైన ట్రోల్స్.. పెళ్లి చేసుకుని తప్పు చేశావ్ అంటూ!

ప్రస్తుతం సమాజంలో ఉన్న నేరాలు, ఘోరాలు లిస్టులోకి ట్రోలింగ్ కూడా చేరిపోయింది. రూ.10 డబ్బులు.. 1 జీబీ డేటా ఉంటే ఎవరినైనా మనం కామెంట్ చేయచ్చు అనే స్థాయికి చాలా మంది దిగజారిపోయారు. అసలు విషయం ఏంటి? అక్కడ ఉన్నది ఎవరు? మనం ఎవరి గురించి కామెంట్ చేస్తున్నాం అనే విచక్షణా జ్ఞానం కూడా లేకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారు. అభిమానం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం మాత్రమే కాకుండా ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే.. ఇప్పుడు చాలా మంది ప్రముఖ టీమిండియా స్పిన్నర్ చాహల్ కు నెట్టింట సలహాలు ఇవ్వడమే కాకుండా.. క్లాసులు పీకుతున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ ని వివాహం చేసుకుని తప్పు చేశావు అంటూ ముదర మాటలు మాట్లాడేస్తున్నారు.

సాధారణంగా సెలబ్రిటీ అనగానే వారిని ఏదైనా అనేయచ్చు, వారి జీవితంపై విమర్శలు గుప్పించ వచ్చు అనే ధోరణితో చాలా మంది ఉంటున్నారు. సోషల్ మీడియాలో తమకు నచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఘోరం ఏంటంటే.. అసలు అది నిజమో కాదో కూడా తెలియని పరిస్థితిలో అలాంటి కామెంట్స్ చేయడం ఇంకా సిగ్గుచేటు. అసలు విషయం ఏంటంటే.. స్మాల్ స్క్రీన్ లవ్ బర్డ్స్ సురభి చందన- కరణ్ శర్మ 13 ఏళ్లు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో జైపూర్ లో ఘనంగా వివాహం చేసుకున్నారు. గత నెలలో వివాహం చేసుకున్న ఈ జంట.. ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సురభి తన భర్తతో పూల్ లో సరదాగా గడుపుతున్న వీడియో షేర్ చేసుకుంది. ఆ వీడియో చూసి అంతా చాహల్ భార్య ధనశ్రీ అనుకుని ట్రోలింగ్ చేస్తున్నారు.

ఆ వీడియోలో ఉన్నది ధనశ్రీ అనుకుని నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. “ఇన్ ఫ్లుఎన్సర్ ని పెళ్లి చేసుకుంటే నీ జీవితమే వేస్ట్ అవుతుంది. ఆమె రోజుకొకరితో ఎంజాయ్ చేస్తుంది” అంటూ ఒక నెటిజన్ చిల్లర కామెంట్ పెట్టాడు. అలాగే ఇంకొకరు ఏకంగా చాహల్ నే ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. “నిన్ను ట్యాగ్ చేసినందుకు సారీ.. నువ్వు ధనశ్రీని ఎంచుకుని తప్పు చేశావ్” అంటూ అసలు విషయం తెలుసుకోకుండా హితబోధ చేయడం ప్రారంభించాడు. ఇలా నెట్టింట అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఎవరిని ట్రోల్ చేస్తున్నాం అనే సోయి కూడా లేకుండా కామెంట్స్ చేసేస్తున్నారు. ఇద్దరు కొత్తగా పెళ్లైన జంటను పట్టుకుని వారి మధ్య ఏదో అక్రమ సం*బంధం ఉన్నట్లుగా.. అందులోనూ మరొకరి భార్యను ఈ వ్యవహారంలోకి లాగుతూ.. ట్రోల్స్, కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

కాస్త దగ్గరి పోలికలు ఉన్నంత మాత్రాన.. వారి వైవాహిక జీవితాన్ని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ఉన్న అఫీషియల్ హ్యాండిల్ లో చాలా స్పష్టంగా సురభి చందనా అని ఉంది. అది కూడా చూడలేనంత బిజీగా ఉండేవాళ్లు.. సలహాలు, సూచనలు మాత్రం చేస్తున్నారు. అంతేకాకుండా ధనశ్రీ క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇన్ ఫ్లుఎన్సర్స్ అంతా ఇలాగే ఉంటారు అన్నట్లు మాట్లాడటం మరింత దారుణం. సాధారణంగా ధనశ్రీపై తరచూ ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇటీవల కూడా వారి కుటుంబంపై కామెంట్స్ చేస్తే ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి.. చాహల్ భార్యపై అనవసరపు ట్రోలింగ్ జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio