iDreamPost

MLC కవితకు ED షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈరోజు (శుక్రవారం) కవిత ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు ఆమెకు అరెస్టు వారెంట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఈడీ కవితను అరెస్టు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈరోజు (శుక్రవారం) కవిత ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు ఆమెకు అరెస్టు వారెంట్ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఈడీ కవితను అరెస్టు చేసింది.

MLC కవితకు ED షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఢిల్లీ మద్యం పాలసీలో ఎంఎల్సీ కవిత కీలక పాత్ర పోషించిందని, ఆమెకు 100 కోట్లు ముడుపులు అందాయని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఈడీ కవితకు నోటీసులు ఇచ్చారు. నేడు ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. తనఖీల్లో ఆమె సెల్ ఫోన్లను సీజ్ చేసిన అధికారులు ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఈ క్రమంలోనే ఎంఎల్సీ కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. కవితకు ఈడీ అధికారులు అరెస్టు నోటిస్ ఇచ్చారు. అనంతరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎంఎల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఎంఎల్సీ కవితకు ఉచ్చు బిగించింది. ఈ రోజు తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు ఆమె ఇంట్లో ఉన్న 16 ఫోన్లను సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహించింది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ అధికారుల ఆరాతీసినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాం నిందితులతో ఆమె లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె అకౌంట్లను తనఖీ చేసినట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉందన్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. మరి కాసేపట్లో ఢిల్లీకి తరలించనున్నారు. కవిత అరెస్టు తో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో ఈడీ కొంతమంది బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి