iDreamPost

బ్రేకింగ్: మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం.. గందరగోళంలో యూజర్లు

Instagram Down Users Upset: సోషల్ మీడియా దిగ్గజ వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి అంతరాయం వాటిల్లడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు.

Instagram Down Users Upset: సోషల్ మీడియా దిగ్గజ వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి అంతరాయం వాటిల్లడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు.

బ్రేకింగ్: మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో అంతరాయం.. గందరగోళంలో యూజర్లు

మనిషి టెక్నాలజీ పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు సాధిస్తున్నాడు. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చారు నిపుణులు. ఇక సోషల్ మాధ్యమాల గురించి ప్రత్యేకంగ చెప్పనక్కరలేదు. ఫేస్ బుక్, ఇన్‌స్ట్రా, ట్విట్టర్, షేర్ చాట్ ఇలా ఎన్నో రకాల సోషల్ మాధ్యమాలు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. ఉదయం నుంచి పడుకునే వరకు కోట్ల మంది జనాలు వీటిపై ఆధారపడే ఉంటున్నారు.  ఇటీవల సోషల్ మాధ్యమాలకు సంబంధించి కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో యూజర్లు గందరగోళంలో పడిపోతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వారంలో రెండోసారి డౌన్ అయ్యింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు మళ్లీ ఇబ్బంది పడ్డారు. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా దిగ్గజం అయిన ఇన్‌స్టాగ్రామ్‌ మరోసారి మొరాయించింది. సాంకేతిక లోపాలు తలెత్తి సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి.. దీంతో యూజర్లు మళ్లీ అయోమయానికి గురయ్యారు. సర్వీస్ అంతరాయంపై ఫిర్యాదులు చేశారు. వెంటనే పునరుద్దరించాలని ‘ఎక్స్’ వేధికగా విజ్ఞప్తి చేశారు. హఠాత్తుగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. యాప్ ఓపెన్ కావడం లేదని.. ఇమేజ్ అప్ లోడ్ కావడం లేదని వాపోయారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 శాతం మందికి ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తుంది. నిరంతరం సోషల్ మీడియాపై ఆధారపడిన నెటిజన్లు ఈ పరిణామాంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మార్చి 5వ తేదీ సాయంత్రం కొద్ది సేపటి వరకు సోషల్ మీడియా దిగ్గజాలు అయిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ హఠాత్తుగా నిలిచిపోయాయి. అకౌంట్ లాగౌట్ కావడంతో యూజర్లు ఒక్కసారే షాక్ కి గురయ్యారు. ఎందుకు ఇలా జరిగిందో తెలియన కోట్ల మంది యూజర్లు తెగ హైరానా పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా సర్వీస్ లకు అంతరాయం కలగడంతో గంటకు పైగా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. ఈ ఒక్క కారణంతో జుకర్ బర్గ్ కి దాదాపు 3 బిలియన్ల డాలర్లు నష్టం వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో ఉన్నట్టుండి మళ్లీ అంతరాయం ఏర్పడటంతో యూజర్లు తెగ ఇబ్బందులు పడ్డారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి