iDreamPost
android-app
ios-app

ఇన్ స్టాలో భర్తకు డివోర్స్.. ఇది దుబాయ్ ప్రిన్సెస్ రేంజ్

  • Published Jul 17, 2024 | 5:33 PM Updated Updated Jul 17, 2024 | 5:33 PM

Dubai Queen Declared Divorce.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువైన సంగతి విదితమే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ క్షేమ సమాచారాన్ని ఇందులోనే పంచుకుంటున్నారు. అంతేనా తమ పర్సన్ ఇష్యూస్ కూడా.

Dubai Queen Declared Divorce.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం చాలా ఎక్కువైన సంగతి విదితమే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తమ క్షేమ సమాచారాన్ని ఇందులోనే పంచుకుంటున్నారు. అంతేనా తమ పర్సన్ ఇష్యూస్ కూడా.

  • Published Jul 17, 2024 | 5:33 PMUpdated Jul 17, 2024 | 5:33 PM
ఇన్ స్టాలో భర్తకు డివోర్స్.. ఇది దుబాయ్ ప్రిన్సెస్ రేంజ్

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు విడిపోయారంటే.. వార్త కోసం చూడనక్కర్లేదు.. వారి సోషల్ మీడియా ఖాతాలను చూస్తే చాలు. ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం, ఎవ్వరి అర్థం కానీ రీతిలో ఏదో కోల్పోయినట్లుగా లేదా జ్ఞానం కలిగినట్లుగా మేసెజెస్ పెడుతుంటారు. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. డివోర్స్ తీసుకోనే అక్కర్లేదు. విడిపోతున్నామని, వేరుగా ఉంటున్నామన్న సంకేతాలు కూడా ఇన్ స్టా వంటి ఖాతాల ద్వారానే వెల్లడి అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు నుండి ఇటీవల తన భర్త ఫోటోలను డిలీట్ చేసిన కోలీవుడ్ స్టార్ నటుడు జయం రవి భార్య ఆర్తి వరకు ఇలాగే చేశారు. దీనికి తాను మినహాయింపు కాదు అని నిరూపించింది దుబాయ్ యువరాణి. తన రేంజ్ ఏంటో చూపించింది.

దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తెల్లో ఒకరైన షైఖా మహ్రా బిన్త్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌కు బహిరంగంగా డివోర్స్ ప్రకటించింది. తన ఇన్ స్టా వేదికగా…‘నీకు విడాకులు ఇస్తున్నాను జాగ్రత్త .. మీ మాజీ భార్య’ అంటూ వార్నింగ్‌తో కూడిన విడాకుల ప్రకటన చేసింది. తమ తొలి బిడ్డకు స్వాగతించిన రెండు నెలలకే ఈ జంట విడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘డియర్ హస్బెండ్.. నువ్వు ఇతరులతో సాన్నిహిత్యంగా మెలుగుతున్నందున.. నేను విడాకులు ప్రకటిస్తున్నాను. నేను విడాకులు ఇస్తున్నా.. (మూడు సార్లు కుండబద్దలు కొట్టినట్లు ఇదే మాట రాసింది).. టేక్ కేర్.. మీ ఎక్స్ వైఫ్’ అంటూ ట్వీట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జంట ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, వారి ప్రొఫైల్‌ల నుండి ఒకరి ఫోటోలన్నింటినీ తొలగించడంతో వీరి మధ్య ఏదో జరిగింది అంటూ చర్చకు దారి తీసింది.

ఒకానొక సమయంలో ఒకరినొకరు బ్లాక్  చేసుకున్నారని కొందరు ఊహించారు. ఇదిలా ఉంటే ఈ ప్రకటన రాగానే మరికొందరు శ్రీమతి షేఖా మహరా ఖాతా హ్యాక్ అయ్యిందా అన్నఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ జంట గత ఏడాది మేలో ఒక్కటి అయ్యింది. సంవత్సరానికి ఈ జంటకు ఓ బిడ్డ కలిగింది. కూతురు పుట్టిన సమయంలో ఈ యువరాణి భావోద్వేగానికి కూడా గురైంది, ఆసుపత్రి సిబ్బంది, తనను బాగా చూసుకున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ సమయంలో కూడా భర్త షేక్ మనా కనిపించాడు. రెండు నెలలు గడిచాయో లేదో.. ఇద్దరి మధ్య చిచ్చు రేగినట్లు తెలుస్తుంది. కొన్ని వారాల క్రితం కూడా షైఖా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రహస్య పోస్ట్‌ను పంచుకుంది. తన బిడ్డను కౌగిలించుకుంటూ.. “మేమిద్దరం మాత్రమే” అని రాసింది. అప్పుడే తాము వేర్వేరుగా ఉంటున్నామని చెప్పిందా అనిపిస్తుంది. ఇదిలా ఉండే నెటిజన్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. షైకా ఓ న్యాయవాది. పలు విషయాలపై మహిళల కోసం పోరాడుతూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Shaikha Mahra Mohammed Rashed Al Maktoum (@hhshmahra)

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet