iDreamPost

Nagababu: నాగబాబు మీద పోటీకి ఓటమెరుగని ఆ నేత రెడీ!

2024లో జరిగే ఎపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తరపు నుంచి మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆ స్థానంలో నాగాబాబుపై పోటీకి ఓటమెరగని ఓ నేతను వైసీపీ దింపుతున్నట్లు సమాచారం.

2024లో జరిగే ఎపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తరపు నుంచి మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆ స్థానంలో నాగాబాబుపై పోటీకి ఓటమెరగని ఓ నేతను వైసీపీ దింపుతున్నట్లు సమాచారం.

Nagababu: నాగబాబు మీద పోటీకి ఓటమెరుగని ఆ నేత రెడీ!

ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఆయారం గాయారం అనే పరిస్థితి కనిపిస్తోంది. ఒకపార్టీ నుంచి మరోపార్టీకి నేతల జంపింగ్స్ మొదలయ్యాయి. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ జంపింగ్స్ వ్యవహారం ప్రతిపక్షాలకు తననొప్పిగా మారింది. ఇది ఇలా ఉంటే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు.. అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ఎవరిని దింపినా.. అనకాపల్లి సీటును ఏ మాత్రం వదలేసే ఆలోచనలో వైసీపీ ఉంది. ఈక్రమంలోనే నాగాబాబుపై ఓటమెరుగని ఓ నేతను పోటీకి సిద్ధం చేసినట్లు సమాచారం.

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయానున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎవరికి ఎన్ని సీట్లు అన్నదానిపై స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఫలానా సీటు వారిది  అంటూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీలో నెంబర్ మూడు స్థానంలో ఉన్న వ్యక్తి నాగబాబుపై కూడా ఓ ప్రచారం సాగుతోంది. ఆయన అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్నాయి. తనకు అన్ని విధాలుగా కలసి వచ్చే సీటు ఇదే అని ఫిక్స్ అయి నాగబాబు అనకాపల్లికి షిఫ్ట్ అయ్యారంట. సామాజికి రాజకీయ సమీకరణాలు అనుకూలిస్తాయని జనసేన ఆలోచించిన మీదటనే నాగబాబుని అనకపల్లి నుంచి పోటీ దించుతున్నారని టాక్. ఇలా కూటమివైపు నుంచి నాగాబాబు  ఉంటే వైసీపీ నుంచి ఎవరు పోటీ అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.

అధికార పార్టీ అంత సులువుగా అనకాపల్లి సీటుని పోనీయదు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. నాగబాబుకు రాజకీయంగా సామాజికంగా ధీటైన జవాబు ఇచ్చే బలమైన అభ్యర్ధిని ఎంపిక చేసి పెట్టిందని సమాచారం. అంతేకాక ఆయన నేతకు ఇప్పటి వరకు ఓటమి ఎరుగలేదు. అలానే వైసీపీకి జగన్ కి వీర విధేయుడు. ఆయన ఎవరో కాదు..మాడుగుల ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ముత్యాల నాయుడు మాడుగుల నుంచి రెండు సార్లు గెలిచారు. అంతేకాక టీడీపీకి కంచుకోట లాంటి మాడుగులను వైసీపీ జెండాను రెపరెపలాడించిన సమర్ధుడైన నేతగా బూడికి పేరుంది. ఆయన మాడుగుల నుంచి పోటీ చేస్తే.. ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.

అయితే ఇలాంటి బలమైన నేతను ఇపుడు వైసీపీ ఎంపీగా పోటీ చేయించాలని చూస్తోంది అని టాక్ వినిపిస్తోంది. వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలనాయుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన నాగబాబుని ఢీ కొట్టి ఘన విజయం సాధించగలరని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. జెడ్పీటీసీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చిన బూడి ముత్యాలనాయుడు ఎక్కడా ఓటమి అనేది ఎరుగలేదు. అందువల్ల ఆయన గెలుపు సెంటిమెంట్ సైతం వైసీపీకి కలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ విధంగా నాగబాబు మీద బూడి ముత్యాలనాయుడు పోటీ చేస్తే కాపు వర్సెస్ బీసీ అన్న కార్డుతో ముందుకు వెళ్లాలని వైసీపీ భావిస్తోందని టాక్. బీసీలు అంతా పోలరైజ్ అయితే అనకాపల్లి లోక్ సభలో వైసీపీ విజయం తధ్యం అన్న ఆలోచనలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి