iDreamPost
android-app
ios-app

ఈమె ఆడదే కాదు.. కూరగాయల వ్యాపారం మాటున దారుణం!

సమాజంలో దారుణాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. అత్యాచారాలు, కిడ్నాపులు, దొంగతనాలు, మోసాలు జరుగుతున్నాయి. ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఇవి చాలవన్నట్లు పెద్ద దందా ఒకటి బయటకు వచ్చింది.

సమాజంలో దారుణాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. అత్యాచారాలు, కిడ్నాపులు, దొంగతనాలు, మోసాలు జరుగుతున్నాయి. ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఇవి చాలవన్నట్లు పెద్ద దందా ఒకటి బయటకు వచ్చింది.

ఈమె ఆడదే కాదు.. కూరగాయల వ్యాపారం మాటున దారుణం!

నిత్యం సమాజంలో మనం ఎన్నో దారుణాలను చూస్తున్నాం. రేప్ కేసులు, కిడ్నాప్‌లు, సెక్స్ రాకెట్, ఇల్లీగల్ వ్యాపారాలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సంఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా పిల్లల అక్రమ రవాణా రాకెట్‌కు సంబంధించి ఓ వార్త అందరిలో కలవరం సృష్టిస్తుంది. సంతానం లేని వారిని గుర్తించి, పసికందులను విక్రయించడమే వీరి బిజినెస్. అయితే ఇటీవల ఈ ముఠాకు చెందిన పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణలో కొన్ని నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ గ్యాంగ్.. గత ఆరేళ్లుగా దాదాపు 250 మంది పసి కందులను వారి వ్యాపారానికి వాడుకున్నట్లు గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ గ్యాంగ్ కు సంబంధించిన కేసును.. బెంగుళూరుకు చెందిన సెంట్రల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో(CCB ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముఠాకు చెందిన ప్రధాన నిందితురాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ప్రధాన నిందితురాలైన మహాలక్ష్మి.. గత ఆరేళ్లలో 250 మంది పసికందులను విక్రయించిందని ముందుగా అధికారులు గుర్తించారు. అయితే ఇందులో 50-60 మంది శిశువులను కర్ణాటకలో విక్రయించగా, మిగిలిన శిశువులను తమిళనాడులో అమ్మకాలు జరిపిందని తెలిపారు. ఇక వీరిలో కేవలం 10 మంది పిల్లల ఆచూకీని సీసీబీ అధికారులు గుర్తించగలిగారు. మిగిలిన పిల్లల వివరాల కోసం విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితురాలు మహాలక్ష్మి విషయానికొస్తే.. ఆమె 2015-2017 మధ్యన ఓ దుస్తుల దుకాణంలో పని చేసేది. ఆ దుకాణానికి వచ్చిన మహిళలతో మాట మాట కలిపి వారి అండాన్ని ఇస్తే రూ. 20 వేలు ఇస్తాను అనేది. ఈ క్రమంలో కొంతమంది మహిళలు ఒప్పుకోగా.. దానినే ఆమె వ్యాపారంగా మార్చుకుంది. ఆరోగ్యంగా ఉన్న యువతులను టార్గెట్ చేసి.. వారికీ డబ్బు ఆశ చూపించి.. వారి నుంచి అండాన్ని సేకరించి విక్రయిస్తూ ఉండేది. ఇదే పద్దతిలో పెళ్లి కాకుండా గర్భం దాల్చిన మహిళలకు కొంత సొమ్ము ఇచ్చి, డెలివరీ తర్వాత ఆ పసికందులను విక్రయించేది. ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి వద్ద కూరగాయల మార్కెట్ పెట్టుకుని.. అక్కడకు వచ్చే ఆడవారిని టార్గెట్ చేసి.. వారిని నమ్మించి అండాల విక్రయ వ్యాపారం సాగించేది. కొన్నేళ్ల పాటు ఆమె తన వ్యాపారాన్ని ఇలా కొనసాగించింది. ఈ క్రమంలో తాజాగా ఓ పసికందును విక్రయిస్తూ ఈ నిందితురాలు పోలీసుల వలకు చిక్కింది.

ఈ క్రమంలో ఆమెతో పాటు.. ఆర్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 రోజుల పసికందును.. అమ్మేందుకు ప్రయత్నించిన ఏడుగురు నిందితులు కన్నన్ రామస్వామి, హేమలత, మహాలక్ష్మి, శరణ్య, సాహసిని, రాధ, గోమతిలను నవంబర్ 28న అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కాగా, నవంబర్ 29న మరో నిందితుడు మురుగేశ్వరి, కెవిన్ అనే నకిలీ వైద్యుడు, మధ్యవర్తి రమ్యను అరెస్టు చేశారు. ఈ నిందితులు గత కొన్నేళ్లుగా పసికందులను దొంగిలించి.. కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాలలో వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. మిగిలిన నిందితుల వివరాలు విచారణ అనంతరం పోలీసులు బయటపెట్టనున్నారు. ఏదేమైనా, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘోరాలు దిన దిన గండంగా మారుతున్నాయని చెప్పాల్సిందే. మరి కర్ణాటకలో జరిగిన పిల్లల అక్రమ రవాణా రాకెట్ కు.. సంబందించిన ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి