Krishna Kowshik
పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఎనలేని గౌరవం ఉంది. అలాగే చూడగానే సెల్యూట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. పోలీసులు అనగానే చాలా మంది సాయి కుమార్ పోలీస్ స్టోరీ మూవీతో పాటు సూర్య సింగం మూవీలు గుర్తుకు వస్తుంటాయి. ఇదిగో ఇప్పుడో ఎస్ఐ
పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఎనలేని గౌరవం ఉంది. అలాగే చూడగానే సెల్యూట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. పోలీసులు అనగానే చాలా మంది సాయి కుమార్ పోలీస్ స్టోరీ మూవీతో పాటు సూర్య సింగం మూవీలు గుర్తుకు వస్తుంటాయి. ఇదిగో ఇప్పుడో ఎస్ఐ
Krishna Kowshik
శాంతి భద్రతలను కాపాడుతూ.. ప్రజా రక్షణకు పాటుపడుతుంటారు పోలీసులు. ఈ రోజుల్లో ప్రజలు హాయిగా నిద్రపోగలుగుతున్నారంటే.. అలాగే విలువైన వస్తువులు ఇంట్లో దాచి వెళుతున్నారంటే కారణం అహర్నిశలు పనిచేసే పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉండటమే. అన్యాయం జరిగిందీ అంటే అక్కడ వాలిపోతుంటారు. ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు ప్రెండ్లీ పోలీసింగ్ సహా పలు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే తప్పు చేసిన వాళ్ల తాట తీయకుండా వదిలిపెట్టరు. నేరస్థులను ఎంత దూరంలో ఉన్నా పట్టుకుని నిజాన్ని కక్కిస్తుంటారు. నేరాలను అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తుంటారు.
అయితే పోలీసులు అనగానే చాలా మంది సాయి కుమార్ పోలీస్ స్టోరీ మూవీతో పాటు సూర్య సింగం మూవీ గుర్తుకువస్తుంది. నేరస్థుల పట్ల సింహ స్వప్నమౌతుంటారు ఈ రెండు పోలీస్ పాత్రలు. ఇదిగో ఇప్పుడు ఓ లేడీ సింగం వార్తల్లో నిలిచింది. పోలీసులపై దాడి చేసి పారిపోతున్న ఓ రౌడీ షీటర్‌ను పట్టుకునేందుకు అతడి వెంట పరిగెత్తింది. కానీ అతడు దొరకలేదు. పేరు మోసిన దొంగ కావడంతో బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపింది. కానీ వినలేదు. దీంతో అతడ్ని పట్టుకునేందుకు గన్ ఉపయోగించక తప్పలేదు. చివరకు అతడి కాలిపై కాల్చింది. దీంతో గాయమై అక్కడే ఆగిపోయాడు. వెంటనే అప్రమత్తమై.. ఆసుపత్రికి చేర్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటుచేసుకుంది. నిందితుడు ముంబయికి చెందిన రౌడీ షీటర్ ఫర్హాన్ షేక్ అని తేలింది. జులై 25న కేశ్వాపూర్‌లోని నగల దుకాణంలో చోరీకి పాల్పడుతుండగా అతడు దొరికిపోయాడు. మిగిలిన వాళ్లు పరారయ్యాడు.
మిగిలిన వారిని వెతకడానికి అతడ్ని గామనగట్టి రోడ్డుకు తీసుకెళ్లారు కానిస్టేబుల్స్ సుజాత, మహేష్. అంతలో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడు. కానిస్టేబుల్ సుజాత, మహేష్‌లపై దాడికి పాల్పడ్డాడు. అతడి వెంట పరిగెత్తారు. అంతలో సివంగిలా మారింది సబ్ ఇన్ స్పెక్టర్ కవితా మదగ్యాల్. తన వద్ద ఉన్న తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి హెచ్చరించింది. అయినప్పటికీ వినలేదు. అంతలో కాలిపై కాల్చగా నిందితుడు అక్కడే కూలబడిపోయాడు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అతడ్ని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చింది. గాయపడ్డ కానిస్టేబుల్ సుజాత, మహేష్‌లను కూడా ఆసుపత్రికి తరలించారు. కాగా, రౌడీ షీటర్ ఫర్హాన్‌పై హైదరాబాద్, కలబురగి, ముంబై, అహ్మద్‌నగర్ (మహారాష్ట్ర), సూరత్ (గుజరాత్)లలో దోపిడీ, దోపిడీ, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.