iDreamPost

భార్యను కాల్ గర్ల్‌గా మార్చిన భర్త.. అంతా స్కెచ్ ప్రకారమే

భార్యా భర్తల మధ్య ఎన్ని గొడవలు రానీ.. జీవిత భాగస్వామిని కుటుంబ సభ్యుల ముందు కూడా తక్కువ చేసి మాట్లాడరు చాలా మంది. కానీ ఈ ప్రబుద్దుడు భార్యను హింసించడమే కాదు.. ఏకంగా కాల్ గర్ల్‌గా మార్చేశాడు. అంతా..

భార్యా భర్తల మధ్య ఎన్ని గొడవలు రానీ.. జీవిత భాగస్వామిని కుటుంబ సభ్యుల ముందు కూడా తక్కువ చేసి మాట్లాడరు చాలా మంది. కానీ ఈ ప్రబుద్దుడు భార్యను హింసించడమే కాదు.. ఏకంగా కాల్ గర్ల్‌గా మార్చేశాడు. అంతా..

భార్యను కాల్ గర్ల్‌గా మార్చిన భర్త..  అంతా స్కెచ్ ప్రకారమే

ఓ మహిళకు అన్ నౌన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి ఆమెను వస్తావా, రేటెంత అని ప్రశ్నించే సరికి గుండె ఝల్లుమంది ఆమెకు. తిట్టి ఫోన్ పెట్టేసింది. మళ్లీ అన్ నౌన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె రాంగ్ నంబర్ అంటూ పెట్టుకుంటూ పోతుంది. ఆమెకే కాదూ.. బాధితురాలి సోదరుడికి కూడా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. దీంతో ఇద్దరు విసిగిపోయారు. ఎక్కడ నుండి ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆలోచించగా.. భర్తే పనేనన్న అనుమానం వ్యక్తమైంది. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. భార్య ఊహించింది నిజమైంది. భర్త వల్లే కాల్స్ వస్తున్నాయని గుర్తించారు పోలీసులు. ఇంతకు ఏం జరిగిందంటే..?

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులోని నందిని లే అవుట్‌లో నివాసముంటున్నారు సత్యనారాయణ రెడ్డి దంపతులు. 2019లో వీరికి వివాహం అయ్యింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. తొలి నాళ్లలో చాలా సంతోషంగా ఉన్న ఈ కాపురంలో రాను రాను గొడవలు మొదలయ్యాయి. సత్యనారాయణ రెడ్డి.. భార్యను ఏడాది కాలంగా మానసికంగా, శారీరకంగా హింసించడంతో వదిలేసి.. పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆమెపై కక్ష గట్టాడు భర్త. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని ఏ భర్త చేయని పని చేశాడు. సోషల్ మీడియా వేదికైన ఫేస్ బుక్‌లో పేజీని క్రియేట్ చేసి..భార్య ఫోటోను పెట్టి.. కాల్ గర్ల్ అని పోస్టు చేశాడు. భార్య నంబర్‌తో పాటు ఆమె సోదరుడి నంబర్ కూడా పోస్టు చేశాడు.

పక్కా స్కెచ్ వేసి ఈ ప్లాన్ అమలు చేశాడు. కళా శశి అనే నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరచి అందులో ఫోటో, కాల్ గర్ల్ అని రాసి.. సంప్రదించాల్సిన వివరాలు అంటూ పోస్టు చేశాడు. ఇక ఆ పోస్టు చూసిన రసిక రాజాలు ఇక వరుస పెట్టి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఆమె సోదరుడికి కూడా ఇదే ఫోన్స్ వస్తుండటంతో విసుగు చెంది పోలీసులను ఆశ్రయించారు. విచారణలో భర్త సత్యనారాయణ రెడ్డి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని తేలింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సత్యనారాయణ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు సెక్షన్ల కింద భర్తపై కేసు నమోదు చేసి అతడ్ని మరింత విచారిస్తున్నారు. ఎంత కోపం ఉన్నా.. భార్యను కాల్ గర్ల్‌గా మార్చేయడం దుర్మార్గం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి