iDreamPost

పుష్ప 2లో అనసూయ అరాచకం.. సుకుమార్ అసలు ప్లాన్ ఏంటంటే?

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఒక గొప్ప నటిగా కొనసాగుతోంది. అయితే పుష్ప పార్ట్ 2 సినిమా విడుదలైన తర్వాత ఆ రేంజ్ మరో స్థాయికి చేరబోతోంది అంటున్నారు.

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం ఒక గొప్ప నటిగా కొనసాగుతోంది. అయితే పుష్ప పార్ట్ 2 సినిమా విడుదలైన తర్వాత ఆ రేంజ్ మరో స్థాయికి చేరబోతోంది అంటున్నారు.

పుష్ప 2లో అనసూయ అరాచకం.. సుకుమార్ అసలు ప్లాన్ ఏంటంటే?

అనసూయ భరద్వాజ్.. టాలీవుడ్ ఇండిస్ట్రీలోనే కాకుండా బుల్లితెర, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది. యాంకర్ గా అనసూయ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లపాటు బుల్లితెర ప్రేక్షకులను తన యాంకరింగ్ తో అలరించింది. అయితే అనసూయను మంచి నటిగా ప్రేక్షకులు అప్పట్లో గుర్తించలేదు. కానీ, ఎప్పుడైతే రంగమ్మత్త పాత్ర వచ్చిందో.. అప్పటి నుంచి అందరూ అనసూయ యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయారు. అనసూయ అనడం కంటే.. రంగమ్మత్తగానే ఎక్కువగా పిలుస్తారు. కానీ, ఇప్పుడు ఆ పాత్రను మరిపించే రేంజ్ లో పుష్ప 2లో అనసూయ పాత్ర ఉండబోతోంది అంటున్నారు.

అనసూయ యాక్టింగ్ గురించి ప్రేక్షకులకు తెలిసిన దానికంటే డైరెక్టర్ సుకుమార్ కు తెలిసిందే ఎక్కువ. ఒక పాత్ర అనుకుని అందులో అనసూయను ఊహించుకుని ఆమెకు అవకాశం ఇచ్చారు. సుకుమార్ పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా.. ఇన్నేళ్ల తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులు ఆ పాత్ర గురించి మాట్లాడుకునే చేసింది అంటే అది అనసూయ నటనలో ఉన్న గొప్పతనం. అలాంటి రంగమ్మత్తకు పుష్పలో ఇచ్చిన దాక్షాయణి పాత్ర చాలామందికి నచ్చలేదు. తమ్మడు చనిపోయాడు అనే బాధతో మొగుడిపై దాడి చేసే సీన్ తప్పితే పెద్దగా ఎలివేషన్స్ ఏం లేవు. మరి.. అలాంటి పాత్రకు అనసూయ ఎందుకు ఒప్పుకుంది? అలాంటి పాత్ర అనసూయకు ఎందుకు ఇచ్చారు? అంటే అసలు కథ పార్ట్ 2లో ఉందంట.

అవును.. పుష్ప పార్ట్ 1లో చూసిన దాక్షాయణి సిండికేట్ హెడ్ మంగళం శ్రీను భార్యగానే చూపించారు. కానీ, పుష్ప ది రూల్ లో మాత్రం ఒక విలన్ గా చూపించబోతున్నారంట. ఇప్పటికే సినిమాలో చాలామందే పవర్ ఫుల్ విలన్స్ ఉన్నారు. కొత్తగా కూడా వస్తున్నారు. కానీ, దాక్షాయణి పాత్రకు మాత్రం రివేంజ్ తీర్చుకోవడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి పుష్ప తన తమ్ముడిని హత్య చేయడం. అలాగే తన భర్త నుంచి సిండికేట్ లాగేసుకోని పుష్ప ఎదగడం. అంతేకాదొండోయ్ తన భర్తపై తానే దాడిచేసే పరిస్థితికి తీసుకురావడం. ఇలా ఈ పాయింట్స్ మీద అనసూయ పాత్ర పార్ట్ 2లో పుష్పరాజ్ మీద గట్టిగానే రివేంజ్ ప్లానింగ్స్ చేసేస్తుందంట. అంతేకాకుండా మరో విలన్ భన్వర్ లాల్ షెకావత్ తో దాక్షాయణి చేతులు కలిపి పుష్పాని ఎలా తప్పించాలి అని ప్రయత్నాలు చేస్తుంది అని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ఇప్పటివరకు అనసూయ అంటే అందరికీ రంగమ్మత్తే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ పాత్రతో అనసూయ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇప్పుడు ఈ దాక్షాయణి పాత్ర చూసిన తర్వాత అనసూయ అంటే ఈ పేరే తల్చుకుంటారు అంటున్నారు. ఆ రేంజ్ లో అనసూయ పాత్ర పుష్ప పార్టు- 2లో అరాచకం సృష్టిస్తుంది అని టాక్ నడుస్తోంది. అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర కాబట్టే అనసూయను ఎంచుకున్నారు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంక పుష్ప ది రూల్ మూవీ విషయానికి వస్తే.. ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు పుష్పరాజ్ రేంజ్ జపాన్ స్థాయికి చేరింది అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అవి ఇలాంటి అప్ డేట్స్ వల్ల మరింత పెరుగుతున్నాయి. మరి.. పుష్ప 2లో అనసూయ పాత్ర అరాచకమే అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి