iDreamPost

చిరు రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే.. ఇందుకు ఈ వీడియోనే సాక్ష్యం!

మెగా స్టార్ చిరంజీవి, సీనియర్ నటి సుహాసినిల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికి తెల్సిందే. దాదాపు మూడేళ్ళ క్రితంనాటి ఓ వీడియో ఈ సమయంలో వైరల్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది...

మెగా స్టార్ చిరంజీవి, సీనియర్ నటి సుహాసినిల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికి తెల్సిందే. దాదాపు మూడేళ్ళ క్రితంనాటి ఓ వీడియో ఈ సమయంలో వైరల్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది...

చిరు రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే.. ఇందుకు ఈ వీడియోనే సాక్ష్యం!

సీనియర్ తమిళ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం నటి ‘విచిత్ర’ తమిళ బిగ్ బాస్ హౌస్‌లో ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా తన వ్యక్తి గత విషయాలను బయటపెట్టింది. సుమారు 20 ఏళ్ళ క్రితం 2001లో తానొక తెలుగు సినిమాలో నటించానని తెలిపింది. కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ సినిమాలోని నటుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని వెల్లడించింది. దీంతో తాను సినిమాలకు దూరంగా ఉంటున్నానని విచిత్ర చెప్పుకొచ్చింది.

ఇక, ఆమె ఏ నటుడి గురించి అంటోందో.. నెటిజన్లతో పాటు సాధారణ జనం కూడా ఓ నిర్థారణకు వచ్చారు. ఆ నటుడికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా మెగాస్టార్‌ చిరంజీవి ఓ ఈవెంట్‌లో ఓ హీరోయిన్‌తో కాస్త సరదాగా ప్రవర్తించిన వీడియోను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేయటం మొదలెట్టారు. ఈ క్రమంలో సుహాసిని.. చిరు రియల్ లైఫ్ హీరోయిజం గురించి బయటపెట్టిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నిజానికి ఆ వీడియో కరోనా టైంలో పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఆవిడ తన స్నేహితులతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ లు ఎక్కువగా చేస్తుండేది. ఆ తరుణంలో ఓసారి తన స్నేహితుడైన చిరంజీవితో లైవ్ మాట్లాడింది. ఆ సంభాషణలో వారిద్దరూ షూటింగ్ కోసం కేరళ వెళ్ళినపుడు జరిగిన ఓ సంఘటనను ప్రస్తావించారు. ‘కేరళలోని అథిరపల్లిలో షూటింగ్ చేస్తున్నాం. మీరు ముందు కారులో ఉన్నారు. నేను, నా హెయిర్ డ్రెస్సర్, డాన్స్ మాస్టర్ తార వెనక కారులో ఉన్నాం. కొంత మంది తాగుబోతులు మా కారును అడ్డుకుని బీరు బాటిళ్లు విసిరారు.

అప్పుడు మీరు ఏం చేశారో గుర్తుందా?’ అని సుహాసిని లైవ్ లో చిరంజీవిని అడిగింది. ‘నేను నా పిస్టల్ బయటికి తీశాను’ అని చిరు చెప్పాడు. అది లైసెన్సుడ్ గన్ అని ఆమె చెప్పుకొచ్చింది. సుహాసిని కార్ పై కొంతమంది తాగుబోతులు బీర్ బాటిల్స్ విసిరారట. దానితో చిరు తన గన్ తీసి ఆ తాగుబోతులను బెదిరించాడట. చిరుతో పాటు ఉన్న యూనిట్ బాయ్స్ కూడా రంగంలోకి దిగి వారికి బుద్ధి చెప్పారట. ఆ సందర్భంలో సుహాసిని మాట్లాడుతూ ‘హీరోయిజం అంటే కెమెరా ముందు చేసేది మాత్రమే కాదు.

రియల్ లైఫ్‌లో కూడా మీరు హీరో. ఈ విషయాన్ని ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్నా’ అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో చిరంజీవి అభిమానుల పాలిట వరంగా మారింది. తమ హీరోను ట్రోల్స్‌ చేస్తున్న వారికి ఈ వీడియోతో కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు! ఈ వీడియోకు చిరు ఫ్యాన్స్ ఇంకాస్త హైప్ ఇస్తున్నారు. ‘కే.జి.ఎఫ్’ చిత్రంలోని ఓ సన్నివేశంతో ఈ వీడియోలోని సీన్స్ ని పోలుస్తూ.. ‘ది రియల్ రాఖీ భాయ్’ అంటూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి, చిరు రియల్ లైఫ్ హీరోయిజం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి