iDreamPost

చంద్రబాబు మౌనం.. సమ్‌థింగ్‌ రాంగ్‌

చంద్రబాబు మౌనం.. సమ్‌థింగ్‌ రాంగ్‌

తన వారికి చీమ కుట్టినా ప్రతిపక్షాల కుట్ర అంటూ ప్రెస్‌మీట్లు పెట్టి గంటలు గంటలు ఉపన్యాసాలు దంచే మాజీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తన బినామీలపై వరసపెట్టి రోజుల తరబడి ఐటీ దాడులు జరుగుతుంటే మాత్రం నోరు విప్పడం లేదు. నాకేమీ తెలియదు.. నేనేమీ చూడలేదన్నట్లు మౌనం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల పాటు తన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శ్రీనివాస్, కిలారు రాజేశ్, నరేష్‌ చౌదరి,కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇళ్లపై నాలుగు రోజులుగా ఏకధాటిగా ఐటీసోదాలు జరుగుతున్నా కిక్కురుమనడం లేదు. ఈ వ్యవహారంపై ఇప్పుడు టీడీపీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఐటీ చూపు వారిపై పడుతుందని చంద్రబాబు అంచనా వేయలేకపోయారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఎలా బయటపడాలనే దానిపై ఆయన తన కోటరీలోని సీనియర్‌ లాయర్లతో సుధీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉండడమే మంచిదని లాయర్లు సూచించారట. ఐటీ అధికారులు బయటికి వచ్చి తాము గుర్తించిన వివరాలు చెబితే గానీ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టత రాదని చెప్పారట. దీంతో కేంద్ర అధికారుల్లో తనకు తెలిసిన వారి ద్వారా ఐటీ సోదాల గురించి ఆరా తీస్తున్నారట. అయితే ఎంత ప్రయత్నించినా సమాచారం బయటికి పొక్కడం లేదు. దీంతో ఐటీ సోదాల వార్తలు తన మీడియాలో వార్తలు రాకుండా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు ఎవరూ మాట్లాడొద్దని చెప్పారట. ఏది ఏమైనా ఈ ఐటీ సోదాల వ్యవహారం టీడీపీలో ఒక కల్లోలం సృష్టించిందనే చెప్పాలి.

ఒక పక్క రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఈడీ, సీఐడీ, ఐటీ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులతో సహా పలువురు అమరావతి నాయకులపై కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో లాగా బయటి పడే మార్గం ఏమాత్రం కనపడకపోవడంతో ప్రజలను దారిమళ్లించడానికి కియా తరలింపు పేరుతో ప్రచారం చేసి డ్రామాలు ఆడారని తెలుస్తోంది. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి