iDreamPost

Chandrababu Naidu: ఐదేళ్లలో భారీగా పెరిగిన చంద్రబాబు ఆస్తులు.. ఏకంగా రూ.810 కోట్లా?

  • Published Apr 20, 2024 | 8:52 AMUpdated Apr 20, 2024 | 8:52 AM

చంద్రబాబు నాయుడు ఆస్తి ఐదేళ్లలో భారీగా పెరిగింది. ఏకంగా 810 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆ వివరాలు ఎలా తెలిసాయి.. అంటే..

చంద్రబాబు నాయుడు ఆస్తి ఐదేళ్లలో భారీగా పెరిగింది. ఏకంగా 810 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆ వివరాలు ఎలా తెలిసాయి.. అంటే..

  • Published Apr 20, 2024 | 8:52 AMUpdated Apr 20, 2024 | 8:52 AM
Chandrababu Naidu: ఐదేళ్లలో భారీగా పెరిగిన చంద్రబాబు ఆస్తులు.. ఏకంగా రూ.810 కోట్లా?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కీలక ఘట్టం నామినేషన్ల పర్వం మొదలైంది. దాంతో కొందరు నేతలు నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. ఇక మే 13 ఏపీ లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎలక్షన్స్‌లో విజయం సాధించడం కోసం అధికార, విపక్ష కూటమి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నామినేషన్ల పర్వం మొదలు కావడంతో.. కొందరు నేతలు తమ నామినేషన్‌ దాఖలు చేశారు. కొందరు అగ్రనేతలు కూడా శుక్రవారం నాడు నామినేషన్‌ ఫైల్‌ చేశారు. వీరిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఆయన తరఫున భార్య.. నారా భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఆస్తులు, అప్పుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అభ్యర్థి.. తనపై నమోదైన కేసుల వివరాలతో పాటు.. ఆస్తులు, అప్పులు ఇతర వ్యవహారాలకు సంబంధించిన వివరాలను అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా.. చంద్రబాబు నాయుడు భార్య.. నారా భువనేశ్వరి ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా అందజేశారు..

నారా భువనేశ్వరి అందజేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు నాయుడు కుటుంబం ఆస్తులు ఈ ఐదేళ్లలో భారీగా పెరిగాయి. అయితే ఆస్తుల్లో ఎక్కువ భాగం భువనేశ్వరి పేరు మీదనే ఉన్నాయి. భువనేశ్వరి ప్రధానంగా హెరిటేజ్ ఫుడ్స్‌లో అత్యధికంగా వాటా కలిగి ఉన్నారు. దీనిలో ఆమె 2.26 కోట్ల షేర్లు కలిగి ఉన్నారు. ఒక్కో షేర్ విలువ 337.85 గా ఉంది. దాని ప్రకారం లెక్కిస్తే.. భువనేశ్వరి ఆస్తుల విలువ దాదాపు 764 కోట్లు. ఇవే కాకుండా ఆమె వద్ద 3.4 కిలోల బంగారం ఉంది. 41.5 కిలోల వెండి ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.

ఇక ఐదేళ్ల క్రితం అనగా 2019 ఎన్నికల సమయంలో నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 545. 76 కోట్లు కాగా.. 2024 వచ్చేసరికి భారీగా పెరిగి.. రూ.764 కోట్లకు చేరుకుంది . ఇక చంద్రబాబు పేరు మీద 4.80 లక్షల విలువైన చరాస్తులు.. 36.31 లక్షల రూపాయల విలువ కలిగిన స్థిరాస్తులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి 2.25 లక్షల విలువైన ఒక అంబాసిడర్ కారు ఉంది. ఇది తప్ప తన దగ్గర ఇతర వాహనాలు లేవని ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు.

మొత్తంగా గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన ఆస్తుల విలువ 41 శాతం పెరిగింది. ప్రస్తుతం అందరి ఆస్తులు కలిపి.. అవి 810.42 కోట్లకు చేరుకున్నాయి. ఇక చంద్రబాబు కుటుంబం పేరు మీద సుమారు 10 కోట్ల రూపాయల వరకు అప్పులున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇక కేసుల విషయానికి వస్తే.. చంద్రబాబు పేరు మీద 24 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి