iDreamPost

TDP Video: ఓటమిని ముందే ఒప్పుకున్న టీడీపీ.. షాకింగ్ వీడియో లీక్!

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఓ రేంజ్ లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడి పొలిటికల్ హీట్ ముందు సమ్మర్ హీట్ కూడా సరిపోదు. ఇదే సమయంలో వైఎస్సార్ సీపీ మరోసారి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో వైసీపీనే గెలుస్తుందంటూ టీడీపీకి సంబంధించిన ఓ వీడి వైరల్ అవుతోంది

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఓ రేంజ్ లో హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడి పొలిటికల్ హీట్ ముందు సమ్మర్ హీట్ కూడా సరిపోదు. ఇదే సమయంలో వైఎస్సార్ సీపీ మరోసారి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో వైసీపీనే గెలుస్తుందంటూ టీడీపీకి సంబంధించిన ఓ వీడి వైరల్ అవుతోంది

TDP Video: ఓటమిని ముందే ఒప్పుకున్న టీడీపీ.. షాకింగ్ వీడియో లీక్!

ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయలు నిప్పుల కొలిమిని మించి వేడి ఇక్కడ ఉంది. మరోసారి గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ ఎన్నికల సమరంలో దూసుకెళ్తుంది. అలానే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వచ్చేనెల 13వ తేదీన ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి..ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన ఓ షాకింగ్ వీడియో లీకైంది. టీడీపీ తమ ఓటమిని ముందే ఊహించింది. 147 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉందని ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన వీడియోను వైసీపీ వీడియో. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

త్వరలో జరగనున్న ఎన్నికలపై అధికారంలోకి వచ్చేది ఎవరా అనే దానిపై అందరిలో ఆసక్తి మారింది. అలానే పలు సర్వేలు అధికార వైఎస్సార్ సీపీనే గెలుస్తుందనే అంచాన వేశాయి. తాజాగా టీడీపీ నేతలు ఎన్నికల పైన సమీక్ష చేస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను అధికార పార్టీ అయినా వైసీపీ విడుదల చేసింది. 2014, 2019 ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ…ప్రస్తుత ఎన్నికల పైన టీడీపీ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఇవ్వడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అందులో 147 స్థానాల్లో రెండు శాతం ఓటింగ్ పెంచుకోవటం ద్వారా గెలుపుకు అవకాశాలు ఉన్నాయని చెప్పటం ఆసక్తి కరంగా మారుతోంది. అంటే.. 147 వైసీపీ ముందంజలో ఉందని, ఆ పార్టీ గెలుపు ఖాయమని టీడీపీ నేతలు ఒప్పుకున్నారు.

ఇక ఈ వీడియోలో టీడీపీ నేత మాట్లాడుతూ..2019 ఎన్నికల్లో 60 సీట్లలో ఓట్ల చీలిక కారణంగా ఓడిపోయామన్నారు. లేకపోతే ఓడినా కూడా 23 సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉండేది కాదన్నారు. తాజాగా 147 స్థానాల్లో కూటమి , వైసీపీ మధ్య అయిదు శాతం ఓట్ల తేడా ఉందని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో పోలైన ఓట్లను నిలబెట్టుకుంటూ..మరో రెండు శాతం ఓటింగ్ పెంచుకుంటే 147 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నేతలకు వివరించినట్లుగా ఆ వీడియోల అర్దం అవుతోంది.  కడప, కర్నూలు జిల్లాల్లో కూటమి కంటే వైసీపీ 10 లక్షల ఓట్ల ముందంజలో ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ విడుదల చేసిన ఈ వీడియో పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి