ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆయనను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలంటూ.. సీఐడీ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన తర్వాత.. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ […]
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విదితమే. ఈ కేసుతో పాటు ఆయనపై పలు కేసులు నమోదు అయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో చంద్రబాబు, తదితరులు అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. గత ఏడాది మేలో నమోదైన ఈ కేసులో చంద్రబాబు […]
పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా జనాలందరికి ఉండే ఏకైక కోరిక.. తాను చనిపోయేలోపు సొంత ఇల్లు కట్టుకోవాలని. ప్రతి మనిషి తాను చనిపోయేలోపు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాడు. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం ఎంత కష్టంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టి ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అంత వేగంగా సాగడం లేదు. […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు. అలానే పేదలకు ఇళ్లు, వైద్యం, విద్యా అందేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేద ప్రజలకు టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల్లో ఇళ్లను అందిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో కూడా సమన్యాయం ఉండేలా పేదలకు కూడా ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చే చర్యలు తీసుకున్నారు. ఈ ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన.. […]
సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేతలు ఆ అనుభవంతో ప్రజలకు వివిధ అంశాలపై హితబోధ చేస్తుంటారు. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు, సూచనలు చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అదే పనిలో ఉన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సం రోజున పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. దేశంలోనే సీనియర్‌ను తాను అంటూ మొదలు పెట్టిన చంద్రబాబు.. కొందరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు పెంచే పార్టీ […]
అమరావతి చుట్టూ టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఆపార్టీ నేతల ఆర్థిక సామ్రాజ్యం దానితో ముడిపడి ఉండడం అందుకు ప్రధాన కారణం. అనేకమంది నాయకులు వేలకోట్ల పెట్టుబడులు పెట్టి, లక్షలకోట్ల రిటర్నుల మీద ఆశలు పెట్టుకుని అమరావతి నిర్మాణానికి పూనుకున్నట్టు కనిపిస్తుంది. దాంతో అమరావతి చుట్టూ ఏర్పడిన సందిగ్ధం తొలగిపోతే టీడీపీ కీలక నేతల ఆర్థిక ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఏకైక రాజధానిగా నిర్ణయం జరిగితే అది ఖచ్చితంగా టీడీపీలో పెత్తనం చేసే నేతలకు భారీలబ్దికి మార్గం […]
రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని పచ్చదండు మైండ్‌గేమ్‌కు తెరతీసింది. ఇక మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదన్నట్టు, అమరావతి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి తీరాలన్నట్టు విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. తీర్పురావడం తరువాయి అమరావతి రైతుల సంబరాలు, ఆనందోత్సాహాలు అంటూ హడావిడి చేశారు. మరోపక్క టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమై హైకోర్టు తీర్పును స్వాగతించింది. ఇంకోపక్క రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు షరీఫ్, యనమల, ధూళిపాళ్ల, పత్తిపాటి పుల్లారావు, […]
ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో అధికారం కట్టబెట్టి యేడాది పూర్తయింది. శాసనసభలో ఆధిక్యంలో ఉన్న పార్టీ ఐదేళ్ళ పాటు అధికారంలో ఉంటుంది. ఈ ఐదేళ్ళు ఎలా పరిపాలన చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి పాలన అందిస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పాలన, ఈ నిర్ణయాలు వారికి నచ్చితే అధికారం మరోసారి కట్టబెడతారు. నచ్చకపోతే ఓడించి మరో పార్టీకి పట్టం కడతారు. రాజధాని విభజన ప్రజలకు నచ్చకపోతే 2024 ఎన్నికల్లో వాళ్ళే తీర్పు చెపుతారు. […]
తెలుగుదేశం పాలనలో రాజధాని పేరిట సాగిన భూ కుంభకోణంలోని వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసిపి మొదటి నుంచి ఆరోపిస్తునట్టుగానే రాజధాని పేరిట భారి ఏత్తున భూముల విషయంలో అవకతవకలు జరిగినట్టు తాజా పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక నియమించి సిట్ బృందం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట సాగించిన భూ దందాలోని నిజనిజాలను ఆదారాలతో సహా వేలికితీసే పనిలో ఉండగా.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి పూర్తి […]
అమరావతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ స్పీడ్ పెంచుతోంది. బాధ్యులను బయటకు లాగుతోంది. ల్యాండ్ పూలింగ్ స్కామ్ బండారం బయటపెడుతోంది. ఆక్రమంలో పలువురు రెవెన్యూ అధికారుల పాత్రను గుర్తించింది. ఇప్పటికే ఒక డిప్యూటీ కలెక్టర్ ని అరెస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు, ఆరుగురు తహశీల్దార్ల పాత్రపై కూడా కీలక అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో నివసిస్తున్న ఓ రెవెన్యూ అధికారి ల్యాండ్ ఫూలింగ్ పథకంలో పెద్ద […]