iDreamPost

కేసీఆర్ అన్న కుమారుడిపై పోలీసు కేసు

తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో భూ కబ్జాలపై ఓ కన్ను వేసింది. తాజాగా ఓ భూ కబ్జా ఘటనలో మాజీ సీఎం కొడుకుపై కేసు నమోదైంది.

తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో భూ కబ్జాలపై ఓ కన్ను వేసింది. తాజాగా ఓ భూ కబ్జా ఘటనలో మాజీ సీఎం కొడుకుపై కేసు నమోదైంది.

కేసీఆర్ అన్న కుమారుడిపై పోలీసు కేసు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. గత గవర్నమెంట్ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఫోకస్ పెంచింది. మేడిగడ్డ డ్యామేజ్‌పై ఇప్పటికే విచారణకు ఆదేశించింది. అలాగే ధరణి పేరుతో జరిగిన భూ అక్రమాలపై కూడా దృష్టిసారించింది. అలాగే తెలంగాణలో భూ కజ్జాలపై కూడా ఓ కన్ను వేసింది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావుపై కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు 38 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు ఫైల్ అయ్యాయి.

వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిపై కన్నారావు.. అతడి గ్యాంగ్ కన్నేసి, కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆ భూమి యజమానులు పోలీసులను ఆశ్రయించారు. తమ భూమి సరిహద్దుల్లో వేసిన ఫెన్సింగ్ అక్రమంగా తొలగించి.. వారు ధైర్జన్యంగా హద్దు రాళ్లను ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కన్నారావుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీలోని 307, 447, 427, 436, 148, 149 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు సైబరాబాద్ పోలీసులు.

38 మందిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. 35 మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కన్నారావుతో సహా మిగిలిన వారంతా జాడ లేకుండా పోయారు. కన్నారావు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు పరారీలో ఉన్న బీఆర్ఎస్ నేతల  కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ధరణి పేరుతో కోట్ల విలువ చేసే భూములు బీఆర్ఎస్ నేతలు మింగేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఇప్పటికే తూర్పూరబడుతోంది అధికార కాంగ్రెస్. ఈ తరుణంలో బీఆర్ఎస్ నేతలు ఇలా అక్రమాలకు పాల్పడటం, వారిపై కేసులు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశమౌతుంది. దీనిపై పోలీసులు మరింత విస్తృతంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి