iDreamPost

BTech పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ.. నెలకు 42,000 జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీటెక్ పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 42 వేల జీతం అందుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీటెక్ పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 42 వేల జీతం అందుకోవచ్చు.

BTech పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ.. నెలకు 42,000 జీతం

ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమంటే అంతా ఈజీ కాదు. అన్ని దశల్లో అసాధారణ ప్రతిభ కనబరిస్తే తప్పా ప్రభుత్వ కొలువు వరించదు. ఇక ప్రైవేట్ రంగంలో జాబ్ పొందాలన్నా కూడా గగనమైపోయింది. కేవలం డిగ్రీలు, పీజీలు ఉంటే సరిపోదు అడిషనల్ గా వివిధ కోర్సులు చేయాల్సి ఉంటుంది. స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. అప్పుడే ప్రైవేట్ రంగంలో రాణించడం సాధ్యమవుతుంది. ఇక బీటెక్ విద్యార్థులకు ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్స్ బాట పట్టడంతో కొత్త నియామకాలకు తావు లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో బీటెక్ పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ జాబ్ పొందే అవకాశం వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని సీఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 74 పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ జాబ్స్ కు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల వయసును కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు పోస్టులను బట్టి నెలకు రూ. 20 వేల నుంచి 42 వేల వరకు అందుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీ కోసం 25-06-2024-04-07-2024 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు:

  • 74

పోస్టుల వివరాలు:

  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
  • ప్రాజెక్ట్ అసోసియేట్-1
  • ప్రాజెక్ట్ అసోసియేట్-2
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్

అర్హత:

  • సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల వయసును కలిగి ఉండాలి.

జీతం:

  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్-42000
  • ప్రాజెక్ట్ అసోసియేట్1-25000-31000
  • ప్రాజెక్ట్ అసోసియేట్2-28000-35000
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-20000

వాక్ ఇన్ ఇంటర్య్వూ తేదీ:

  • 25-06-2024-04-07-2024 వరకు

వేదిక:

  • సీఎస్ఐఆర్-ఎన్ఏఎల్, ఆర్ఏబీ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్, కొడిహళ్లి, బెంగళూరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి