iDreamPost
android-app
ios-app

ఈ అర్హతలుంటే చాలు.. లైఫ్ సెట్ అయ్యే జాబ్స్ రెడీ.. 1,40,000 జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,40,000 జీతం అందుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,40,000 జీతం అందుకోవచ్చు.

ఈ అర్హతలుంటే చాలు.. లైఫ్ సెట్ అయ్యే జాబ్స్ రెడీ.. 1,40,000 జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఇదే మంచి అవకాశం. భారీ వేతనాలతో కూడిన ఈ ఉద్యోగాలను సాధించి జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. నెలకు లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి బీఎస్సీ అగ్రికల్చర్‌, బీకాం, సీఏ, న్యాయశాస్త్రంలో డిగ్రీ, పీజీ డిగ్రీ పాసై ఉండాలి. పోస్టులను బట్టి 30-32 ఏళ్ల వయసును కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 2 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టులు: 214

విభాగాల వారీగా ఖాళీలు:

జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ – 120

జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌) – 40

జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌)- 20

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌)- 20

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌)- 11

జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌): 01

అసిస్టెంట్‌ మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 01

అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌): 01

అర్హత:

  • పోస్టులను అనుసరించి బీఎస్సీ అగ్రికల్చర్‌, బీకాం, సీఏ, న్యాయశాస్త్రంలో డిగ్రీ, పీజీ డిగ్రీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు నెలకు రూ.40,000- రూ.1,40,000. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000. ఇతర పోస్టులకు రూ.22,000-రూ.90,000.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు చివరి తేదీ:

  • 02-07-2024