iDreamPost

HYD NIMSలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు.. కాంపిటీషన్ తక్కువ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ లోని నిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ లోని నిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

HYD NIMSలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు.. కాంపిటీషన్ తక్కువ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇదే మంచి ఛాన్స్. హైదరాబాద్ లోని నిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు పోటీ తక్కువ ఉండనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన పనిలేదు. తాజాగా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 51 ఖాళీలను భర్తీచేయనున్నారు.

సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ పాసై ఉండాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూన్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.1,21,641 అందిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

సీనియర్ రెసిడెంట్ పోస్టులు సంఖ్య: 51

విభాగాలవారీగా ఖాళీలు:

రేడియేషన్ అంకాలజీ: 01

జనరల్ మెడిసిన్: 01

పాథాలజీ: 05

మైక్రోబయాలజీ: 01

అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్: 17

రేడియాలజీ & ఇమేజియాలజీ: 11

గైనకాలజీ: 01

క్లినికల్ ఇమ్యునాలజీ & రుమటాలజీ: 02

ఎండోక్రైనాలజీ & మెటబాలిజం: 02

మెడికల్ జెనెటిక్స్: 02

హెమటాలజీ: 02

న్యూరాలజీ: 06

అర్హత:

  • సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌ లైన్‌

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

  • ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.1,21,641.

 

  • దరఖాస్తుకు చివరితేదీ:26-06-2024

దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:

  • O/o. Executive Registrar,
    Nizam’s Institute Of Medical Sciences (NIMS),
    Panjagutta, Hyderabad.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి