iDreamPost

AP: వాహనదారులకు అలెర్ట్.. ట్రాఫిక్ రూల్స్ మారాయ్.!

  • Published Feb 22, 2024 | 7:09 PMUpdated Feb 22, 2024 | 7:09 PM

నగరాల్లో రోజు రోజుకీ ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్న క్రమంలో.. ట్రాఫిక్ పోలీసులు ఈ ఇబ్బందులను తొలగించడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరాల్లో రోజు రోజుకీ ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్న క్రమంలో.. ట్రాఫిక్ పోలీసులు ఈ ఇబ్బందులను తొలగించడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 22, 2024 | 7:09 PMUpdated Feb 22, 2024 | 7:09 PM
AP: వాహనదారులకు అలెర్ట్.. ట్రాఫిక్ రూల్స్ మారాయ్.!

ప్రముఖ నగరాల్లో రోజు రోజుకి ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రమాదాలు కూడా పెరిగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పైన ఎన్ని రకాలుగా అవగాహనా కల్పించిన సరే.. వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు తప్పడం లేదు. అందులోను కేవలం ప్రతిరోజు తిరిగే వాహనాలే కాకుండా.. రవాణాకు సంబంధించిన ఇతర భారీ వాహనాలు కూడా వస్తూ ఉండడంతో.. ఏపీ పోలీసులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ ఆధారంగా అటు రోడ్డు ప్రమాదాలతో పాటు.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇక నుంచి ప్రజలు కొత్తగా అమలు చేయబోయే ఈ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని. లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని.. పోలీసులు సూచించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అయితే, కొత్తగా ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయాలు తక్షణమే అమలులోకి వస్తాయంటూ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నగరంలోకి వచ్చే భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధించారు. అనుమతి ఉన్న వాహనాలకు కూడా .. నిర్ణీత సమయాలను కేటాయించారు. ఇక ప్రైవేట్ బస్సులు కూడా రాత్రి 10 తర్వాత మాత్రమే సిటీలోకి ప్రవేశించాలని.. ఉదయం 8 గంటలలోగా ఆ బస్సులు నగరం బయటకు వెళ్లిపోవాలని తెలియజేశారు. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో ఆ వాహనాలు ప్రయాణించాల్సి వస్తే.. ముందుగా వాటికీ తగిన పర్మిషన్స్ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే.. ఎక్కువ బరువు ఉన్న వాహనాలను పూర్తిగా నిషేధించారు. అంతే కాకుండా లోకల్ లారీలతో పాటు ఇతర సామాగ్రి తరలించే.. 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలని పేర్కొన్నారు.

అలాగే, . డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు 3.5 టన్నులు, 12 టన్నుల మధ్య బరువుతో ఉన్న వాహనాలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకే మాత్రమే తిరగాలని.. ప్రైవేట్ బస్సులు కేవలం రాత్రి 10 నుంచి ఉ. 8 గంటల మధ్యనే నగరంలో ప్రయాణించాలని.. ఆదేశాలు జారీ చేసారు. అలాగే, మిగిలిన సాధారణ వాహనాలను సుమారు 61 రూట్స్ లో నిషేదించారు. అంతే కాకుండా భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తరలించే వాహనాల్లో.. 2 నుంచి 6 టన్నుల మధ్య బరువు ఉన్న వాహనాలు ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5 గంటల వ్యవధి, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య మాత్రమే సంచరించాలని.. పోలీసులు ఆంక్షలు విధించారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి