iDreamPost
android-app
ios-app

పసుపు లైట్ ఫ్లాష్ అవుతుంటే ఏం చేయాలో తెలుసా? చాలామంది తెలియక చేసే పొరపాట్లు

  • Published Jul 13, 2024 | 10:17 PM Updated Updated Jul 13, 2024 | 10:17 PM

Do You Know What To Do If The Yellow Light Is Flashing: రెడ్ పడితే ఆగాలని.. గ్రీన్ పడితే వెళ్లాలని.. ఎల్లో లైట్ పడితే ఆగడానికి సిద్ధంగా ఉండాలని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే పసుపు రంగు లైట్ మెరుస్తూ వెల్గుతున్నప్పుడు ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదు. మరి ఆ లైట్ ఎందుకు అలా వెలుగుతుందో తెలుసా?

Do You Know What To Do If The Yellow Light Is Flashing: రెడ్ పడితే ఆగాలని.. గ్రీన్ పడితే వెళ్లాలని.. ఎల్లో లైట్ పడితే ఆగడానికి సిద్ధంగా ఉండాలని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే పసుపు రంగు లైట్ మెరుస్తూ వెల్గుతున్నప్పుడు ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదు. మరి ఆ లైట్ ఎందుకు అలా వెలుగుతుందో తెలుసా?

  • Published Jul 13, 2024 | 10:17 PMUpdated Jul 13, 2024 | 10:17 PM
పసుపు లైట్ ఫ్లాష్ అవుతుంటే ఏం చేయాలో తెలుసా? చాలామంది తెలియక చేసే పొరపాట్లు

వాహనాలు నడిపే చాలా మందికి ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. రెడ్ పడితే ఆగాలని.. గ్రీన్ సిగ్నల్ పడితే ముందుకు సాగాలని తెలిసే ఉంటుంది. తెలిసినా గానీ కొంతమంది ఆగరు.. గ్రీన్ సిగ్నల్ పడిన వెంటనే పోరు. దీంతో వెనుక నుంచి హారన్ల హోరు.. మనుషుల మధ్య పోరు. గ్రీన్, రెడ్ కాకుండా మధ్యలో ఇంకొక లైట్ ఉంటుంది. అదే పసుపు రంగు లైట్. ఇది రెడ్ సిగ్నల్ పడే రెండు, మూడు సెకన్ల ముందు పడుతుంది. ఎల్లో సిగ్నల్ పడిందంటే దానర్థం ఆగడానికి సిద్ధంగా ఉండాలని. ఒకవేళ స్టాప్ లైన్ క్రాస్ చేస్తే ఇంటర్ సెక్షన్ ఉంటుంది. అక్కడ ఆగిపోవాలి. అయితే మీరు గమనిస్తే.. పసుపు రంగు లైట్ ఫ్లాష్ అవుతా ఉంటుంది. పగటి పూట, రాత్రి పూట పసుపు లైట్ ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అంటే వెలిగి ఆరి, వెలిగి ఆరుతుంటుంది. అయితే ఇలా ఎందుకు అవుతుంది? ఇలా ఫ్లాష్ అయినప్పుడు ఏం చేయాలి? అనే విషయాలు మీ కోసం. 

పసుపు లైట్ ఫ్లాష్ అవుతుందంటే రెడ్ లైట్ పడుతుందని అర్థం. ఏ సమయంలో అయినా రెడ్ లైట్ పడచ్చు కాబట్టి నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తుంది. పాదచారులు రోడ్ క్రాస్ చేయడం, కూడలి, రోడ్డు పని జరుగుతుండడం వంటి వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అలర్ట్ అయ్యేందుకు పసుపు రంగు లైట్ ఫ్లాష్ అవుతుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక రోడ్డు నుంచి మరొక రోడ్డుకి వెళ్తున్నప్పుడు అవతల నుంచి వాహనాలు వేగంగా వచ్చే అవకాశం ఉన్నాయన్న సంకేతాన్ని ఇవ్వడానికి పసుపు పసుపు లైట్ మెరుస్తుంటుంది. ఆ సమయంలో జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకుని డ్రైవ్ చేయాలని అర్థం. పాదచారులు లేదా సైకిల్ తొక్కేవాళ్ళు రోడ్డు దాటడానికి సిద్ధంగా ఉన్నారని లేదా దాటుతున్నారని సూచించేందుకు పసుపు లైట్ మెరుస్తూ వెలుగుతుంది.

ట్రాఫిక్ సర్కిల్ లేదా పెద్ద కూడలి వచ్చినప్పుడు అక్కడ కొన్ని వాహనాలు ఉంటాయి. అవి వెళ్లేవరకూ ఆగాలని అర్థం. లేదంటే ట్రాఫిక్ జామ్ కి కారణమైనవాళ్లు అవుతారు. ఎల్లో లైట్ ఫ్లాష్ అవుతుందంటే దానర్థం దగ్గరలో స్కూల్ ఉందని.. వాహనదారులు స్కూల్ పరిధిలోకి వచ్చారని అర్థం. కాబట్టి వాహనదారులు ఇక్కడ మరింత జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద పసుపు రంగు లైట్ ఫ్లాష్ అవుతుందంటే.. వాహన వేగం తగ్గించాలి.. జాగ్రత్తగా ఉండాలి.. ఆగడానికి సిద్ధంగా ఉండాలి. తదనుగుణంగా డ్రైవింగ్ ని సర్దుబాటు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పైవేమీ కాకుండా ట్రాఫిక్ సిగ్నల్ లో సరిగా పని చేయడం లేదని అర్థం. సరిగా పని చేయడం లేదని చెప్పడాన్ని సూచిస్తుంది.