iDreamPost
android-app
ios-app

మళ్లీ తెరపైకి కిడ్నీ రాకెట్‌.. రూ.30 లక్షలు ఆశ చూపి!

  • Published Jul 08, 2024 | 5:52 PMUpdated Jul 09, 2024 | 6:39 PM

ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ కిడ్నీ రాకెట్‌ ల గుట్టు పలుమార్లు తెర పైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. పేదోళ్లని టార్గెట్ చేస్తూ ఈ దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి. పైగా ఇటీవల కాలంలో కూడా నగరంలోనే అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ దందా వెలుగులోకి రావడంతో తీవ్ర కలకరం నెలకొంది. అయితే ఈ ఉదాంతం మరువకే ముందే మరోసారి ఈ కిడ్నీ రాకెట్ కలకలం అనేది తాజాగా చోటు చేసుకుంది.

ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ కిడ్నీ రాకెట్‌ ల గుట్టు పలుమార్లు తెర పైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. పేదోళ్లని టార్గెట్ చేస్తూ ఈ దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి. పైగా ఇటీవల కాలంలో కూడా నగరంలోనే అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ దందా వెలుగులోకి రావడంతో తీవ్ర కలకరం నెలకొంది. అయితే ఈ ఉదాంతం మరువకే ముందే మరోసారి ఈ కిడ్నీ రాకెట్ కలకలం అనేది తాజాగా చోటు చేసుకుంది.

  • Published Jul 08, 2024 | 5:52 PMUpdated Jul 09, 2024 | 6:39 PM
మళ్లీ తెరపైకి కిడ్నీ రాకెట్‌.. రూ.30 లక్షలు ఆశ చూపి!

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన అవినీతి, అక్రమ కార్యకలాపాలు అడుగడుగునా పెరిగిపోతున్నాయి. ఈజీగా డబ్బును సంపాదించాలనే ఆశతో చాలామంది లేనిపోని దారుణలకు ఒడిగడుతున్నాయి. అయితే రాను రాను ఈ అడ్డుదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా మనుషుల శరీరంలోని అవయవాలతో కూడా చివరికి వ్యాపారం చేసేస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని కిడ్ని దందాలు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పలసిన అవసరం లేదు. ఇక రాకెట్టు గుట్టు దందాలో ప్రధాన సూత్రదారి డాక్టరు అనే తెలియడంతో.. నగరవాసులు ఒక్కసారిగా ఊలిక్కిపడ్డారు. అయితే ఈ ఘటన ఇంకా మరువక ముందే మరోసారి ఈ కిడ్నీ రాకెట్ కలకలం అనేది తాజాగా చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ కిడ్నీ రాకెట్‌ ల గుట్టు పలుమార్లు తెర పైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. పేదోళ్లని టార్గెట్ చేస్తూ ఈ దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి. పైగా ఇటీవల కాలంలో కూడా నగరంలోనే అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ దందా వెలుగులోకి రావడంతో తీవ్ర కలకరం నెలకొంది. అయితే ఈ ఉదాంతం మరువకే ముందే తాజాగా విజయవాడలోని మరోసారి కిడ్నీ రాకెట్ దాందాల కలకలం సృష్టించింది. కాగా, గుంటూరుకు చెందిన  ఓ బాధితుడికి కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామని ఆశచూపి ఓ ముఠా మోసం చేసింది. తీరా  ఆపరేషన్‌ చేశాక  కిడ్నీ తీసుకుని, డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరించింది. దీంతో మోసపోయనని తెలుసుకున్న బాధితుడు చేసేదేమి లేక గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

కాగా, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతనికి విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి సోషల్‌మీడియాలో పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే.. మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే 30 లక్షల డబ్బు వస్తే తన సమస్యలు అన్నీ తీరుతాయని ఆశపడిన మధుబాబు వెంటనే కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు. ఇక మధుబాబు ఒప్పుకోవడంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నారు.

అయితే ఆపరేషన్‌ తర్వాత మధు బాబుకు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 1.10 లక్షలు మాత్రమే బాషా ఇచ్చాడు. దీంతో మిగిలిన డబ్బులు అడిగేసరికి బాషా తన నిజస్వరూపం బయటపెట్టాడు. అంతేకాకుండా.. స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు. అందుకే నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్‌ శరత్‌బాబు, మధ్యవర్తి బాషాపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశాడు. మరి, డబ్బు ఆశ చూపి కిడ్నీ దోచుకొని మోసం చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి