iDreamPost

చంద్రబాబుకి షాక్… మరో కేసు నమోదు!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో మొదలైన కేసుల నమోదు.. కొనసాగుతూనే ఉంది. తాజాగా చంద్రబాబుపై మరో కేసు నమోదైంది

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో మొదలైన కేసుల నమోదు.. కొనసాగుతూనే ఉంది. తాజాగా చంద్రబాబుపై మరో కేసు నమోదైంది

చంద్రబాబుకి షాక్… మరో కేసు నమోదు!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో మొదలైన కేసుల నమోదు.. కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మంట్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు,  ఫైబర్ గ్రిడ్, మద్యం కేసు, అంగళ్ల అల్లర్ల ఘటనపై కేసులు నమోదయ్యాయి. తాజాగా చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుస కేసులతో షాకి గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో దాదాపు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఇటీవలే ఏపీ హైకోర్టు మధ్యతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఈక్రమంలోనే ఆయనపై మద్యం కేసు నమోదైంది. తాజాగా చంద్రబాబుపై మరో కేసు కూడ నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.  ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేశారనే ఫిర్యాదుతో చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని వైసీపీ నేతలు అన్నారు. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి మాటలకు బలం చేకూర్చేలా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోట్ల జరిమానా విధించింది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. అలా టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి.  ఈ నేపథ్యంలో తాజాగా ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. మరి.. చంద్రబాబుపై మరో కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి