iDreamPost

అంగన్వాడీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సమ్మె కాలానికి సంబంధించి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలకు శుభవార్తను అందించింది. వారికి ఆ జీతాలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలకు శుభవార్తను అందించింది. వారికి ఆ జీతాలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంగన్వాడీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సమ్మె కాలానికి సంబంధించి..

బాల బాలికలకు, గర్భవతులకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి జీతాలు అందిస్తుంటాయి. అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుతో పౌష్టికాహారలోపాన్ని అధిగమించడానికి మార్గం సుగమం అయ్యింది. గర్భిణీలకు, బాల బాలికలకు పౌష్టికాహారం సరఫరా చేయడంలో అంగన్వాడీ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే కొంత కాలం క్రితం తమకు వేతనాలు పెంచాలిని మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతూ అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు దిగారు. కాగా ఈ సమ్మెకాలానికి సంబంధించి జగన్ సర్కార్ అంగన్వాడీలకు తీపి కబురును అందించింది. సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది ఏపీలో అంగన్వాడీ సిబ్బంది జీతాలు పెంచాలని సమ్మెకు పిలుపునిచ్చారు. పలు డిమాండ్లను నెరవేర్చాలని 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. అయితే ఈ సమ్మెకాలానికి సంబంధించిన వేతనాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ శుక్రవారం (మార్చి 15)న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 42 రోజులపాటు సమ్మె కాలానికి జీతాలు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి