iDreamPost

‘అనంతపురం’ రైతుకు అరుదైన అవార్డు!

అనంతపురం జిల్లా రైతుకు అరుదైన అవార్డు లభించింది. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఏటీఎం విధానంలో వ్యవసాయం చేసిన నారాయణప్ప అందరిని ఆకట్టుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

అనంతపురం జిల్లా రైతుకు అరుదైన అవార్డు లభించింది. వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఏటీఎం విధానంలో వ్యవసాయం చేసిన నారాయణప్ప అందరిని ఆకట్టుకున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

‘అనంతపురం’ రైతుకు అరుదైన అవార్డు!

దేశానికి రైతే వెన్నెముక అనే విషయం మనందరికి తెలిసిందే. ఆయన రేయింబవళ్లు కష్టపడి పని చేస్తేనే.. ఎందరో మూడు పూటలా హాయిగా భోజనం చేస్తారు. అలానే రైతులు కూడా మారుతున్న కాలాన్నిబట్టి వ్యవసాయంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. వ్యవసాయం చేసే విధానంలో కొత్తదనాన్నిచూపిస్తున్నారు. ఇలా ఎందరో రైతులు తమదైన శైలీలో వ్యవసాయం చేస్తూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన రైతుకు అరుదైన అవార్డు లభించింది. మరి ఆ అవార్డు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం. నారాయణప్ప అనే రైతు ప్రయోగత్మకంగా వ్యవసాయం చేశారు. కేవలం 30 సెంట్ల విస్తీర్ణంలో ఏడాది పొడవునా 20 రకాల పండలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.  అతడి ప్రయోగాన్నికి  ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి, ఆర్ఈఎక్స్, కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్టీవోస్  అనే సంస్థ ఏటా అంతర్జాతీయ స్థాయిలో  కర్మవీర చక్ర పురస్కారం వివిధ రంగాల్లో విశిష్టే సేవలు చేసిన వారికి అందజేస్తుంది. అయితే ఈ ఏడాది నారాయణప్పకు  కర్మవీర చక్ర పురస్కారం వరించింది.

గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసిన దివంగత శాస్త్ర వేత్త ఎంఎస్ స్వామినాథన్, క్రీడారంగంలో రాహుల్ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కళారంగంలో కాజోల్ తదితరులకు ఈ అవార్డును పొందారు. ఇప్పుడు అలాంటి ప్రముఖుల సరసన నారాయణప్పకు చోటు లభించింది. న్యూఢిల్లీలో సోమవారం జరిగే  కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటు కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్(2023-24) కూడా అందుకోనున్నారు.

నారాయణప్ప వ్యవసాయంలో కలిసి రాక కొంతకాలం భవన నిర్మాణ కూలీగా  చేశాడు. అయితే తిరిగి  నారాయణప్ప పొలం బాట పట్టారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 30 సెంట్ల భూమిలో రసాయన రహిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 రకాలకు పైగా పంటలు పండిస్తూ కరువు నేలలో సిరుల పంట పండిస్తున్నారు. దీని కోసం ఆయన ఎనీ ఐటం మనీ విధాన్ని ఎంచుకున్నారు. సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రతి నెలా ఆదాయం ఆర్జిస్తున్నాడు. కేవలం రూ.5 వేల పెట్టుబడితో  ఏడాది పొడవును రూ.2 లక్షల ఆదాయాన్ని రాబడుతున్నాడు.

నారాయణప్ప చేపట్టిన  ఈ వినూత్న సాగు విధానం అంతర్జాతీయ సంస్థ ఐకాంగో ను ఆకర్షించింది. దీనిపై సుదీర్ఘ కాలం  అధ్యయనం చేసింది.   ఈ కొత్త విధానం ద్వారా మట్టి, భూమి ఆరోగ్యంగా మారడంతో పాటు భూమి మెత్తబడి ఆకు,కాండం ఆరోగ్యంగా ఉంటాయి.  ఏటీఎం సాగు విధానం ద్వారా వెదర్ లో మార్పులు చోటుచేసుకొని  క్లైమేట్ ఛేంజ్ సాధ్యమవుతోందని సంస్థ గుర్తించింది.

ఇలా ఏడాది పొడవును  ఆదాయం సంపాదిస్తూనే.. నేలల్లో కర్బన స్థిరీకరణకు దోహదపడేలా కృషి చేస్తున్న నారాయణప్ప రైతుల పాలిట  ఛేంజ్ ఏజెంట్ గా నిలిచారని సంస్థ పేర్కొంది. 2023-24 సంవత్సరానికి గాను కర్మవీర్ చక్క అవార్డుకు నారాయణప్పను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నారాయణప్ప మాట్లాడుతూ.. మార్పు అనేది మనతోనే మొదలవ్వాలనేది తన ఆలోచన అని, వ్యవసాయంలో  ఏడాది పొడవునా ఆదాయం ఎందుకు రాదన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఏటీఎం మోడల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెల్చుకున్న నారాయణప్పను అందరూ అభినందిస్తున్నారు. మరి..  నారయణప్పకు మీరు కూడ అభినందనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి