iDreamPost

ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకంటే..!

Amitabh Bachchan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ సినిమా జూన్ 27 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన  ట్రైలర్స్ అందరిలో ఆసక్తిని మరింత స్థాయికి తీసుకెళ్లాయి.

Amitabh Bachchan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ సినిమా జూన్ 27 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన  ట్రైలర్స్ అందరిలో ఆసక్తిని మరింత స్థాయికి తీసుకెళ్లాయి.

ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకంటే..!

ప్రస్తుతం ఏ ఇద్దరు సినీ లవర్స్ కలిసిన మాట్లాడుకునే అంశం కల్కి 2898ఏడీ. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరు ఈగర్  ఉన్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కల్కి 2898ఏడీ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్ ఈ సినిమాపై భారీ అంచాన్ని పెంచేశాయి. అంతేకాక టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది…అనేక ఆసక్తికర విషయాలను మూవీ టీమ్ బయట  పెడుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బి అమితాబ్ ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభాస్ అభిమానులకు సారీ చెప్పారు. మరి.. ఎందుకు  చెప్పారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ సినిమా జూన్ 27 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన  ట్రైలర్స్ అందరిలో ఆసక్తిని మరింత స్థాయికి తీసుకెళ్లాయి. మరోవైపు  సినిమా విడుదల సమయం దగ్గర పడే కొద్ది మూవీ మేకర్స్, టీమ్ మెంబర్స్ ఆసక్తికర విషయాలను బయట పెడుతున్నారు. తాజాగా కల్కి టీమ్ అంతా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు.  ఇదే సమయంలో అమితాబ్ మాత్రం ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడీ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Amitab

‘కల్కి 2898ఏడీలో భైరవగా ప్రభాస్, అశ్వద్థామగా అమితాబ్ బచ్చన్ నటించారు. వీళ్లిద్దరి మధ్య భారీ స్థాయిలో ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయట. ట్రైలర్ చూస్తే.. ఈ విషయం అర్థమైపోతుంది. ఈ ఫైటింగ్ సీన్ గురించే అమితాబ్ బచ్చన్ ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దని బిగ్ బీ చెప్పుకొచ్చారు.

నాగ  అశ్విన్.. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి తన దగ్గరికి వచ్చినప్పుడు  పాత్ర ఎలా ఉండబోతుందని, ప్రభాస్ పాత్ర ఏంటనేది చూపించేందుకు కొన్ని ఫొటోలు చూపించాడని అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చాడు. ‘కల్కి’లో తనది ప్రభాస్‪‌ని కొట్టే పాత్ర అని చెప్పాడు. అందుకే ముందే చెబుతున్నా ప్రభాస్ ఫ్యాన్ దయచేసి క్షమించండని తెలిపారు. ఈ సినిమాలో తాను చేసే పనులు చూసిన తర్వాత  తిట్టుకోకండని, ట్రోల్ చేయకండని అమితాబ్ అన్నాడు. దీనికి ప్రభాస్ నవ్వుతూ.. ‘అయ్యో సర్, వాళ్లంతా మీకు కూడా అభిమానులేనని తెలిపాడు.  మొత్తంగా వీరిద్దరి మధ్య జరగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి