iDreamPost

TDPపై క్రికెటర్ అంబటి రాయుడు సెటైర్లు!

Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. తరచూ వివిధ ప్రాంతాల్లో సందర్శిస్తూ.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టీడీపీపై సెటైర్లు వేశారు.

Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఏపీ రాజకీయాల్లో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. తరచూ వివిధ ప్రాంతాల్లో సందర్శిస్తూ.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టీడీపీపై సెటైర్లు వేశారు.

TDPపై క్రికెటర్ అంబటి రాయుడు సెటైర్లు!

టీమిండియా మాజీ క్రికెటర్,  ఏపీకి చెందిన అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిడియా తరపున అనేక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడారు. తనదైన శైలీలో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంబటి రాయుడు కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు. కొంతకాలం క్రితమే అన్ని ఫార్మాట్ లకి రాయుడు గుడ్ బై చెప్పారు. ఆ తరువాత ఏపీ రాజకీయల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్న రాయుడు.. ఏపీ నుంచే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌ను కొన్నాళ్లుగా పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు రాయుడు.  తాజాగా టీడీపీపై కూడా పరోక్షంగా సెటైర్లు వేశారు అంబటి రాయుడు.

అంబటి రాయుడు క్రికెట్ కి గుడ్ బై చెప్పిన తరువాత సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంతట  పర్యటిస్తున్నారు. అంతేకాక వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా రాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ చేపడుతున్న కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటుండటం గమనార్హం. ఈ క్రమంలోనే అంబటి రాయుడు వైఎస్సార్ సీపీలో చేరటం ఖాయమని అంటూ వార్తలు కూడ వస్తున్నాయి. పలు సందర్భాల్లోఈ వార్తలపై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తరచూ ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టీడీపీపై  పరోక్షంగా సెటర్లు వేశారు.  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంబటి రాయుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. తన క్రికెట్ కెరీర్ గురించి అనేక విషయాలను వెల్లడించారు. అంతేకాక రాజకీయాలపై తనకు ఉన్న ఆసక్తి ఎంటనేది తెలిపారు. ఇదే సమయంలో జర్నలిస్ట్ అడిగిన ఓ క్రికెట్ ప్రశ్నకు అంబటి రాయుడు టీడీపీతో పొల్చుతూ సమాధానం ఇచ్చారు.

మీ క్రికెట్ రీ ఎంట్రీకి  ఎంఎస్కే ప్రసాద్ కారణమా? అని ఓ విలేకరి ప్రశ్నించారు.  అందుకు సమాధానంగా.. అలా చెప్పుకుంటూ ఉంటారు. మనమేం చేస్తామని రాయుడు సమాధానం ఇచ్చారు. తెలంగాణాలో కాంగ్రెస్ గెలవడానికి తామే కారణమని టీడీపీ క్లైయిమ్ చేసుకుంటోందిగా అని రాయుడు ఉదహరిస్తూ చెప్పుకొచ్చారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా అందరూ ఎదగాలనే సీఎం జగన్, వైసీపీ సిద్ధాంతాలు తనకు ఇష్టమని తెలిపారు. మరి..తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి