iDreamPost

Business Idea: సొంత ఊరిలో బెస్ట్ బిజినెస్ ఐడియా! రూ.60 వేల పెట్టుబడితో.. 9 లక్షలు ఆదాయం!

  • Published Jun 18, 2024 | 3:46 PMUpdated Jun 18, 2024 | 3:46 PM

Aloe Vera Cultivation: సొంత ఊరిలోనే ఉంటూ.. కాలు కదపకుండా.. ఏడాదికి అత్యంత తక్కువ పెట్టుబడితో.. లక్షల్లో ఆదాయం సంపాదించాలని భావిస్తున్నారా .. అయితే మీ కోసమే ఈ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా. దీన్ని ఫాలో అయితే వేల రూపాయల ఖర్చుతో లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. ఆ వివరాలు..

Aloe Vera Cultivation: సొంత ఊరిలోనే ఉంటూ.. కాలు కదపకుండా.. ఏడాదికి అత్యంత తక్కువ పెట్టుబడితో.. లక్షల్లో ఆదాయం సంపాదించాలని భావిస్తున్నారా .. అయితే మీ కోసమే ఈ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా. దీన్ని ఫాలో అయితే వేల రూపాయల ఖర్చుతో లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. ఆ వివరాలు..

  • Published Jun 18, 2024 | 3:46 PMUpdated Jun 18, 2024 | 3:46 PM
Business Idea: సొంత ఊరిలో బెస్ట్ బిజినెస్ ఐడియా! రూ.60 వేల పెట్టుబడితో.. 9 లక్షలు ఆదాయం!

చాలా మందికి సొంత ఊరిలోనే ఉండి.. వ్యవసాయమో, వ్యాపారమో చేసుకోవాలని కోరికగా ఉంటుంది. కానీ పరిస్థితులు అందుకు తగ్గట్టుగా ఉండవు. పెట్టుబడి లేకనో.. లేదంటే సరైన ఆదాయం లభించదనే కారణంతోనో చాలా మంది ఆ దిశగా ప్రయత్నాలు చేయరు. మరి కొందరేమో.. ఊరిలో ఉండి వ్యవసాయం చేయడం నామోషీగా భావించి.. పట్టణాల్లో చాలీచాలనీ జీతంతో.. భారంగా జీవితాలను సాగిస్తుంటారు. కానీ కాస్త ధైర్యం చేసి.. ఓ అడుగు ముందుకు వస్తే.. సొంత ఊరిలోనే ఉంటూ.. చాలా తక్కువ పెట్టుబడితో.. లక్షల రూపాయల ఆదాయం సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. ఇందుకు కావాల్సింది కాస్తంత ఓపిక.. కొంత మార్కెటింగ్‌ నైపుణ్యం. ఇక మరీ మీరు కూడా సొంత ఊరిలోనే ఉంటూ.. తక్కువ పెట్టుబడితో.. భారీ ఎత్తున లాభాలు పొందాలని భావిస్తున్నారా.. అయితే మీకోసమే ఈ వార్త.

సొంత ఊరిలోనే ఉంటూ.. చాలా తక్కువ పెట్టుబడితో.. ఏడాదికి లక్షల రూపాయాల ఆదాయం పొందే మార్గం ఒకటి ఉంది. అదే కలబంద సాగు. దీనికి ఏడాదికి సుమారు 60 వేల రూపాయల వరకు ఖర్చు రాగా.. ఆదాయం మాత్రం 8-9 లక్షల వరకు ఉంటుంది అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఒక హెక్టార్‌ భూమిలో కలబంద సాగు చేస్తే.. మీ పంట పండినట్లే. ఇది ఏడాదికి నాలుగు సార్లు కోతకు వస్తుంది. అలానే హైదరాబాద్‌, బెంగళూరుకు చెందిన పలు కంపెనీలు.. నేరుగా పొలం వద్దకే వచ్చి మీ పంట కొనుగోలు చేస్తాయి. ఇక నేటి కాలంలో కలబందకు ఆయుర్వేద పరంగానే కాక.. సౌందర్య సాధనాల్లో కూడా భారీ ఎత్తున వినియోగిస్తున్నారు. పైగా దీనికి ఏడాదంతా డిమాండ్‌ ఉంటుంది. కలబంద సాగులో తెగుళ్లు ఆశిస్తాయనే భయం లేదు. తక్కువ నీటి వనరులతో కూడా కలబంద సాగు చేయవచ్చు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా కూడా కలబంద సాగు చేయవచ్చు.

ఇక కలబంద నాటిన పది నెలల్లోనే కోతకు వస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి పంటను కోయవచ్చు. అంటే ఏడాదికి నాలుగు సార్లు పంట మీ చేతికి వస్తుంది. మీరు ముందుగా ఒప్పదం చేసుకుంటే.. సౌందర్య సాధనాలు ఉత్పత్తి చేసే కంపెనీల నిర్వాహకులు.. నేరుగా మీ చేను వద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తారు. అప్పుడు మీకు పంటను తరలించే పని కూడా ఉండదు. ఇక కలబంద సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఇసుక నేలలు అయితే చాలా మంచిది అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. కలబంద సాగుకు నీటి వాడకం కాస్త తక్కువే. అయినా.. సరే భూగర్భ జలాలు కాస్త ఎక్కువగా ఉండే నేలనే కలబంద సాగు కోసం ఎంచుకోవాలి అని చెబుతున్నారు.

జూన్‌-ఆగస్ట్‌ మధ్య కలబంద మొక్కల్ని నాటుకోవాలి. హెక్టార్‌లో కలబంద సాగు చేయడానికి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కూలీల ఖర్చు, సాగు కోసం అయ్యే మొత్తం, పురుగు మందులు అన్నింటిని కలుపుకుంటే హెక్టార్‌ పొలంలో కలబంద సాగుకు ఏడాదికి గాను 60 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఇక హెక్టార్‌ పొలంలో కలబంద నాటితే.. 40-50 టన్నల దాకా దిగుబడి వస్తుంది. ఇక కలబందను సబ్బులు, క్రీములు, లోషన్ల తయారీలో వాడతారు.

చాలా కంపెనీలు నాణ్యమైన, పెద్ద సైజు ఆకుల కోసం 15-20 వేల రూపాయలు వరకు చెల్లిస్తున్నాయి. ఆ లెక్కన తక్కువలో తక్కువ 40 టన్నుల దాకా దిగుబడి వస్తే.. టన్ను 15 వేల రూపాయలు పలికినా.. 6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అదే 50 టన్నుల వరకు దిగుబడి వచ్చి.. టన్నుకు 20 వేలు పలికితే.. 10 లక్షల ఆదాయం వస్తుంది. పెట్టుబడి 60 వేల రూపాయలు పోతే.. పైన మిగిలిందంతా లాభమే అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి