iDreamPost
android-app
ios-app

18 ఏళ్లు నిండాయా? లైఫ్ సెట్ అయ్యే బిజినెస్ ఐడియా.. లోన్ కూడా ఇస్తారు!

  • Published May 31, 2024 | 8:38 PM Updated Updated May 31, 2024 | 8:38 PM

Best Business Ideas- Loan Facility For Above 18 Years Old: మీరు ఒకరి దగ్గర ఉద్యోగం ఏం చేస్తాం.. సొంతంగా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. వీళ్లు మీకు లోన్ కూడా ఇస్తారు.

Best Business Ideas- Loan Facility For Above 18 Years Old: మీరు ఒకరి దగ్గర ఉద్యోగం ఏం చేస్తాం.. సొంతంగా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. వీళ్లు మీకు లోన్ కూడా ఇస్తారు.

  • Published May 31, 2024 | 8:38 PMUpdated May 31, 2024 | 8:38 PM
18 ఏళ్లు నిండాయా? లైఫ్ సెట్ అయ్యే బిజినెస్ ఐడియా.. లోన్ కూడా ఇస్తారు!

ఈ రోజుల్లో చాలా మంది ఒకరి దగ్గర ఉద్యోగం చేసే కంటే.. ఒక మంచి వ్యాపారం చేసేందుకే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాకపోతే అందరికీ వ్యాపారం చేసేందుకు నగదు సపోర్ట్ ఉండకపోవచ్చు. చాలా మంది సరైన ఆర్థిక భరోసా లేక వారి ప్రయత్నాలను విరమించుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా తీసుకొచ్చాం. దీనికోసం మీకు లోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు. దీనికోసం మీకు సొంత స్థలం, వ్యాపారం చేసే ఆసక్తి ఉంటే సరిపోతుంది. అలాగే ఇందుకోసం మి వయసు 18 ఏళ్లు నిండితే సరిపోతుంది. ఈ అద్భుతమైన బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బిజినెస్ ఐడియాస్ అంటే మొదట గుర్తొచ్చేది పౌల్ట్రీ ఫార్మ్. దీనిని స్టార్ట్ చేసేందుకు కాస్త భూమి ఉండాలి. ఆ భూమిలో షెడ్స్ వేసి సొంతంగా కోడి పిల్లలను తీసుకొచ్చి వాటిని పెంచుకోవాలి. వాటిని పెంచేందుకు తగిన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇదంతా కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే చాలా మంది పౌల్ట్రీ బిజినెస్ నేట్ వెనకడుగు వేస్తుంటారు. అలా పౌల్ట్రీ బిజినెస్ చేసే ఆసక్తి ఉంది 18 ఏళ్లు నిండి ఉంటే మీరు ఈ లోన్ నీ తీసుకోవచ్చు. ఈ లోన్ ను ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు అందిస్తున్నారు. పౌల్ట్రీ ఫార్మ్ పెట్టేందుకే వీళ్ళు ఈ లోన్ ఇస్తున్నారు. ఈ లోన్ పొందలి అంటే మి వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి. మీకు ఒక సొంత స్థంలం ఉండాలి. ఆ స్థలం మీద యాజమాన్యం హక్కు చూపించాలి.   ఈ లోన్ లో మీకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తారు.

లోన్ రకాలు:

కోడి పిల్లల కొనుగోలు, కోడి పిల్లలకు మేత కొనుగోలు చేసేందుకు ఓవర్ డ్రాఫ్ట్ లోన్ సౌకర్యాన్ని పొందవచ్చు. కాకపోతే దీర్ఘకాలిక లోన్ మాత్రం కాదు. అయితే దీర్ఘకాలిక లోన్ కోసం ఇంకో సదుపాయం ఉంది. దాని పేరు టర్మ్ లోన్. ఈ టర్మ్ లోన్ కింద మీరు కోడి పిల్లల కోసం షెడ్లు, రవాణా వాహనాలు, పౌల్ట్రీ యూనిట్ ఏర్పాటు వంటి అవసరాల కోసం ఈ టర్మ్ లోన్ ను ఇస్తారు. ఇంక ఈ లోన్ కోసం అప్లయ్ చేసుకునేందుకు కావాల్సిన ప్రధాన అర్హత వయసు 18 ఏళ్లు కంటే ఎక్కువ 75 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. భూమి తాలూకు పత్రాలు ఉండాలి. ఈ లోన్ కి సంబంధించి వడ్డీ రేట్లు కూడా సరసంగానే ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఉజ్జీవన్ ఫైనాన్స్ వారి అధికారిక వెబ్ సైట్ ని సంప్రదించండి. మరి.. ఈ లోన్ సదుపాయం మీకు ఎలా అనిపిస్తోంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio