iDreamPost
android-app
ios-app

అరెకరం భూమి ఉంటే చాలు.. నెలకు రూ.2 లక్షలు సంపాదించే ఛాన్స్‌.. ఎలా అంటే

  • Published Jun 13, 2024 | 2:56 PM Updated Updated Jun 13, 2024 | 2:56 PM

Business Idea: వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా.. అయితే మీ కోసమే ఇది మీ కోసమే. ఈ బిజినెస్‌ చేయడం కోసం మీ దగ్గర కేవలం అరెకరం పొలం ఉంటే చాలు... నెలకు 2-3 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్‌ వివరాలు..

Business Idea: వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా.. అయితే మీ కోసమే ఇది మీ కోసమే. ఈ బిజినెస్‌ చేయడం కోసం మీ దగ్గర కేవలం అరెకరం పొలం ఉంటే చాలు... నెలకు 2-3 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్‌ వివరాలు..

  • Published Jun 13, 2024 | 2:56 PMUpdated Jun 13, 2024 | 2:56 PM
అరెకరం భూమి ఉంటే చాలు.. నెలకు రూ.2 లక్షలు సంపాదించే ఛాన్స్‌.. ఎలా అంటే

నేటి కాలంలో ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అనుకునే యువత సంఖ్య భారీగా ఉంటుంది. నెలంతా పని చేస్తూ.. ఆఖరులో జీతం తీసుకునే బదులు.. వ్యాపారం చేస్తూ.. తాను ఎదగడమే కాక.. తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు చాలా మంది యువత. అయితే బిజినెస్‌ చేయడం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు. లక్షల్లో పెట్టుబడి పెట్టి.. కొన్నాళ్ల పాటు ఎలాంటి ఆదాయం ఆశించకుండా ఉంటూ.. విపరీతంగా శ్రమించాలి. వీటన్నితో పాటు కాస్తంత అదృష్టం కూడా కలిసి రావాలి. అప్పుడే వ్యాపారంలో సక్సెస్‌ చవి చూస్తాం. లేదంటే భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది.

అయితే అన్ని వ్యాపారాలకు లక్షల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. కొన్నింటికి మీ మాటతీరు, తెలివితేటలే పెట్టుబడి అవుతాయి. మరికొన్నింటికి పెట్టుబడి భారీగా పెట్టాలి. లాభాలు కూడా అదే స్థాయిలో వస్తాయి. అలా భారీ లాభాలు ఆర్జించే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ బిజినెస్‌ గురించి జనాలకు ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. ఇక మీరు కనక ఈ వ్యాపారం చేయాలనుకుంటే.. మీకు ముఖ్యంగా కావాల్సింది అర ఎకరం పొలం. ఇది ఉంటే చాలు మీరు ప్రతి నెల 2 లక్షల నుంచి 3 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది అలాంటి ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనలో చాలా మందికి చేపల వ్యాపారం గురించి తెలుసు. చెరువులు, నదులు, సముద్రాల్లో చేపలను పట్టుకొచ్చి.. వాటిని అమ్ముతుంటారు. ఇక కొందరు కృత్రిమంగా చెరువులు ఏర్పాటు చేసి చేపల సాగు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మనం తెలుసుకోబోయే పద్ధతిని రిసర్క్యూలేటర్‌ ఆక్వాకల్చర్‌ సిస్టమ్‌(ఆర్‌ఏఎస్‌) పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో చేపల చెరువు ఏర్పాటు చేయకుండానే కేవలం అర ఎకరం స్థలంలో చేపల పెంపకం అనేది చేయవచ్చు. ఇందుకోసం మీరు ఏం చేయాలి.. దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది వంటి వివరాలు మీకోసం..

ఆర్‌ఏఎస్‌ పద్దతి అంటే ఏంటి..

ఆర్ఏఎస్ పద్ధతిలో ముందుగా చేపల కోసం ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ పద్దతిలో ట్యాంకుల్లోనే చేపలను పెంచుతుంటారు. సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో అయితే.. చేపల పెంపకం కోసం.. చెరువును తవ్వి.. నీటిని నింపి చేపల పెంపకం చేపడితే.. ఆ నీటి ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడం అనేది కష్టతరం అవుతుంది. అలాగే చేపలకు మేత వేసినప్పుడు ఆ మేత మిగిలిన భాగాలు చెరువు అడుక్కు చేరుతూ ఉంటాయి. దాంతోపాటు చేప విసర్జితాలు కూడా చెరువులోనే కలిసిపోతుంటాయి. ఇక ఆ చెరువులో నీటిని మార్చడం అనేది చాలా కష్టతరమైన పని అప్పుడు చెరువులో విసర్జితాలు కలుషితాలు పెరిగి చేపల ఆరోగ్యం పాడుతూ ఉంటుంది.

కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్‌ఏఎస్‌ పద్దతిలో.. చేపల ట్యాంకుల కింది భాగంలో పైపులు ఏర్పాటు చేసి నీటిని మారుస్తూ ఉంటారు. దీని వల్ల చేపలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి కావాల్సిన ఆక్సిజన్‌ పుష్కలంగా లభిస్తుంది. అలాగే చేపలకు వేసిన మేత కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కాకపోతే.. ఈ పద్దతిలో చేపల సాగుకు పెట్టుబడి కాస్త ఎక్కువగా అవుతుంది. ట్యాంకుల ఏర్పాటుకు అదేవిధంగా ఇతర సామాగ్రికి దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చవుతాయి. కాకపోతే ఈ పద్దతిలో చేపల పెంపకం అనేది కాస్త సులువు అని చెప్పవచ్చు. ఈ పద్ధతిలో చేపలను పెంచినట్లయితే ప్రతినెల 2 లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.